DRDO Recruitment: డీఆర్‌డీవీలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తులకు గడువు ఇంకా రెండు రోజులే..
DRDO Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRI)లో...
DRDO Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో పలు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. బెంగళూరులోని డీఆర్‌డీవోకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRI)లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు (75), డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీలు (20), ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీలు (25), గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు (జనరల్ స్ట్రీమ్) (30) పోస్టులు ఉన్నాయ.
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలో భాగంగా మెకానికల్, ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
* డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల్లో భాగంగా మెకానికల్/ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టు్ల్లో భాగంగా మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.
* వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు(జనరల్ స్ట్రీమ్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 14-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Telangana: సర్కారు బడిలో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి..
Equity Mutual Funds: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు..
Andhra Pradesh: కువైట్‌లో త్రిబుల్ మర్డర్స్.. ఉలిక్కిపడ్డ కడపజిల్లా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!