CMAT 2022 exam date: సీమ్యాట్ 2022 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల! ఎప్పుడంటే..
కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT-2022) పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం (మార్చి 11) విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం..
CMAT 2022 exam date released: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT-2022) పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం (మార్చి 11) విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం NTA CMAT 2022 పరీక్ష ఏప్రిల్ 9న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ పరీక్ష (కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్, గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు)కు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులెవరైనా ఉంటే మార్చి 17లోపు అధికారిక వెబ్‌సైట్ nta.ac.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CMAT 2022కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ nta.ac.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్ పేజ్‌లో కనిపించే CMAT లింక్‌పై క్లిక్ చెయ్యాలి. న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది.
- లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్ చెయ్యాలి.
- తర్వాత అప్లికేషన్ ఫాంను ఫిల్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి.
- సబ్‌మిట్‌పై క్లిక్ చేసి, పూర్తి చేసిన అప్లికేషన్ ఫాంను డౌన్‌లోడ్ చేయండి
Also Read: