AP Inter exams 2022: ఏపీ ఇంటర్‌ 2022 సెకండియర్‌ ప్రాక్టికల్స్ వాయిదా! త్వరలో కొత్త తేదీలు..

మార్చి 11 (శుక్రవారం) నుంచి ప్రారంభంకావాల్సిన ఇంటర్మీడియట్ సెకండియర్‌ ప్రాక్టికల్ పరీక్షల (AP Inter 2nd year practical exams)ను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (BIEAP) శుక్రవారం (మార్చి 11) నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

AP Inter exams 2022: ఏపీ ఇంటర్‌  2022 సెకండియర్‌ ప్రాక్టికల్స్ వాయిదా! త్వరలో కొత్త తేదీలు..
Bieap
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 12, 2022 | 7:11 AM

AP Inter exams 2022 Postponed: మార్చి 11 (శుక్రవారం) నుంచి ప్రారంభంకావాల్సిన ఇంటర్మీడియట్ సెకండియర్‌ ప్రాక్టికల్ పరీక్షల (AP Inter 2nd year practical exams)ను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు (BIEAP) శుక్రవారం (మార్చి 11) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలు త్వరలో రీ షెడ్యూల్ చేస్తామని బోర్డు ఈ సందర్భంగా తెలిపింది. ఐతే ప్రాక్టికల్ పరీక్షలు ఎందుకు రద్దుచేశారు? అనే విషయం మాత్రం ఇప్పటి వరకు బోర్డు తెలియజేయలేదు. కాగా ఇంటర్ సెకండియర్‌ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగాల్సి ఉంది. ఏపీ ఇంటర్ మార్చి 2022 ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు కూడా అధికారిక వెబ్‌సైట్‌లో bie.ap.gov.in బోర్డు విడుదల చేసింది. ఐతే ఏపీ ఇంటర్‌ బోర్డు జంబ్లింగ్ విధానంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తాజాగా (మార్చి 10) కొట్టేసింది. ఈ ఏడాది జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నిర్వహించాలని, ఏ కాలేజీ విద్యార్ధులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని హైకోర్టు ఇంటర్‌ బోర్డును ఆదేశించింది.

ప్రాక్టికల్స్‌ పూర్తి కాగానే ఇంటర్‌ థియరీ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12వ తేదీ వరకూ జరగనున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఏప్రిల్ 22, 25, 27, 29, మే 2, 6, 9, 11 తేదీల్లో జరగనుండగా.. సెకండియర్ పరీక్షలు ఏప్రిల్ 23, 26, 28, 30, మే 05, 07, 10, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావల్సిన ఈ పరీక్షలు..జేఈఈ మెయిన్స్ (JEE mains)పరీక్ష తేదీల కారణంగా వాయిదా పడ్డాయి.  కొత్త తేదీలు విడుదలయ్యాక ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తి అయిన తర్వాత థియరీ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇక  ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరిగే థియరీ పరీక్షలకు హాల్ టికెట్లు వేరుగా ఉంటాయి. అవి త్వరలో విడుదలవుతాయి.

Also Read:

AP DME Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగాలు..