Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.? టీఎస్‌పీసీలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదా.? ఇలా చేయండి..
Telangana Govt Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతోన్న అభ్యర్థులకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), అసెంబ్లీ సాక్షిగా శుభవార్త తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఏకంగా...
Telangana Govt Jobs: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతోన్న అభ్యర్థులకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), అసెంబ్లీ సాక్షిగా శుభవార్త తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఏకంగా 80 వేలకుపైగా ఉద్యోగాలను (Govt Jobs) భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. దీంతో కొన్నేళ్లుగా పుస్తకాలతో కోసం కుస్తీ పడుతోన్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలనే కసితో ప్రిపరేషన్‌లో వేగాన్ని పెంచారు.
ఇదిలా ఉంటే డీఎస్‌సీ లాంటి పోస్టులు కాకుండా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా టీఎస్‌పీఎస్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అభ్యర్థులు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం..
- ముందుగా అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- అనంతరం హోమ్ పేజీలో కనిపించే ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ పైన క్లిక్ చేయాలి.
- వెంటనే టీఎస్‌పీఎస్ ఓటీఆర్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- అనంతరం అభ్యర్థుల ప్రాథమిక వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
- అనంతరం అడ్రస్ వివరాల్లో భాగంగా శాశ్వత నివాసాన్ని ఎంటర్ చేయాలి.
- తర్వాత విద్యార్హతలకు సంబంధించిన వివరాలతో పాటు సంబంధిత సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- అనంతరం ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
- చివరిగా ప్రివ్యూ బటన్‌పై క్లిక్ చేసి ఎంటర్ చేసిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయేమే చూసుకొని సబ్‌మిట్ నొక్కితే టీఎస్‌పీఎస్‌సీ ఐడీ జనరేట్ అవుతుంది. భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే. ఈ ఐడీ ఎంటర్ చేసి నేరుగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: UP Elections 2022: యూపీలో కంగుతిన్న బీఎస్పీ.. ఇక కథ కంచికి చేరినట్లేనా..?