UP Elections 2022: యూపీలో కంగుతిన్న బీఎస్పీ.. ఇక కథ కంచికి చేరినట్లేనా..?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ(UP Assembly Elections) ఎన్నికల్లో ఘోర పరాభవంతో బీఎస్పీ(BSP) పని అయిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు...

UP Elections 2022: యూపీలో కంగుతిన్న బీఎస్పీ.. ఇక కథ కంచికి చేరినట్లేనా..?
Mayawati
Srinivas Chekkilla

|

Mar 11, 2022 | 5:32 PM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ(UP Assembly Elections) ఎన్నికల్లో ఘోర పరాభవంతో బీఎస్పీ(BSP) పని అయిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీలో ఆ పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి మాయావతి(Mayawati) వైకరే కారణమని వాదనాలు వినిపిస్తున్నాయి. ఆమె ఈ ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఈ ఎన్నికల ప్రచారంలో మాయావతి కేవలం 18 ర్యాలీల్లోనే పాల్గొంది. దీన్ని బట్టే అర్థమవుతుంది ఆమె ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదని. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 209 రోడ్‌షోలతో అందరి కంటే ముందు ఉండగా.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 203 ర్యాలీలతో రెండో స్థానంలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 117 ర్యాలీలతో మాయావతి కంటే ముందున్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె ఇంత తక్కువగా ప్రచారం చేయడానికి కారణం ఆమె ఉదాసీనతా..లేక బీజేపీకి భయపడుతున్నారా.. లేక ఆ పార్టీతో కలిసిపోయారా.. అన్న ఆరోపణలు వస్తున్నాయి.

సీబీఐ, ఎన్‌ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్లతో బీజేపీ మాయవతిని భయపెట్టిస్తుందా.. మాయావతి దళిత నాయకత్వాన్ని చంద్రశేఖర్ ఆజాద్ లేదా ఉదిత్ రాజ్ వంటి యువ నాయకులకు అప్పగించిందా? అనే ప్రశ్నాలకు ఇప్పుడు సమాధానాలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ, మాయావతి, ఆమె పార్టీ భవిష్యత్తు ప్రశ్నర్థంగా మారింది. ఆ పార్టీ క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే బీఎస్పీ జాయతీ పార్టీ హోదా కోల్పోయే ప్రమాదం ఉంది. 2007 నుంచి 2012 వరకు అధికారంలో ఉన్న బీఎస్పీ ఆ తర్వాత అధికారాన్ని కోల్పోయింది. 2012 ఎన్నికల్లో ఆ పార్టీ 80 సీట్లకు పరిమిత కాగా.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సంఖ్య 19కి చేరింది. ఇప్పుడు కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. మాయావతి క్రమంగా అన్ని వర్గాల మద్దతును కోల్పోతూ వస్తున్నారు. 2007లో 30 శాతం ఓట్లతో ఆమె మాయావతి అధికారంలోకి వచ్చినప్పుడు.. ఆమెను కాబోయే ప్రధాన మంత్రి అని అన్నారు. కానీ ఆమె తన ఉదాసీనతతో పార్టీ నిర్వీర్యం అయ్యే స్థితికి తీసుకొచ్చారు.

చాలా మంది ఇతర దళిత ప్రముఖులు, ఆర్థికంగా అంతగా లేని వారు బీఎస్పీ నమ్ముకుని ఎన్నికున్నారు. కానీ ఆ తర్వాత వారని మాయావతి నిర్లక్ష్యం చేశారు. దళితేతరులను ఎన్నికల్లో పోటీకి దింపేందుకు ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. ఆమె గురువు, బీఎస్‌పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ సిద్ధాంతాల నుంచి ఆమె పాటించడం లేదంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఆమెకు పలువురు అనుచరులు దూరమవుతూ వచ్చారు. బీఎస్పీ హయాంలో ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శి ఫతే బహదూర్ సింగ్ ఇటీవలే సమాజ్ వాదీ పార్టీలో చేరారు. బీఎస్పీ లోక్‌సభ, రాజ్యసభల్లో పార్టీ నాయకత్వాన్ని బ్రాహ్మణులకు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో మాజీ ఐఏఎస్ అధికారి పీఎల్ పునియా కాంగ్రెస్‌లో చేరారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ మాజీ డైరెక్టర్ జనరల్ బ్రిజ్‌లాల్‌ను బీజేపీలో చేరారు. దీంతో ఆమె క్రంగా ఒంటరిగా మారుతున్నారు. ఆమె ఇప్పటికైనా మేల్కోకపోతే బీఎస్పీ పూర్తి తుడిచిపెట్టుకుపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Also.. Anurag Thakur: యూపీ కురుక్షేత్రంలో బీజేపీకి అక్కరకొచ్చిన యువనాయకుడి రాజకీయ చాణక్యత..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu