AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కువైట్‌లో త్రిబుల్ మర్డర్స్‌.. ఉలిక్కిపడ్డ కడపజిల్లా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

Andhra Pradesh: బతుకు దేరువు కోసం కువైట్ వెళ్లిన భారతీయుల పరిస్థితి అందరికీ తెలిసిందే. పనులకోసం వెళ్ళి నానా యాతన పడుతుంటారు.

Andhra Pradesh: కువైట్‌లో త్రిబుల్ మర్డర్స్‌.. ఉలిక్కిపడ్డ కడపజిల్లా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!
Chittoor man Arrested
Shiva Prajapati
|

Updated on: Mar 11, 2022 | 8:51 PM

Share

Andhra Pradesh: బతుకు దేరువు కోసం కువైట్ వెళ్లిన భారతీయుల పరిస్థితి అందరికీ తెలిసిందే. పనులకోసం వెళ్ళి నానా యాతన పడుతుంటారు. తప్పు చేసినా చేయకపోయినా జైళ్ళలో పడేసి తాట తీస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితే కడప జిల్లా వాసికి ఎదురైంది. ముగ్గురిని హతమార్చిన కేసులో వెంకటేష్ అనే వ్యక్తిని కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. హత్య చేసింది వెంకటేషా కాదా అనేది తేలియకపోయినా ప్రస్తుతం కువైట్ పోలీసుల కస్టడీలో వెంకటేష్ ఉన్నాడు. వెంకటేష్ భార్య స్వాతి మాత్రం తన భర్తను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని తనను కాపాడాలని బోరున విలపిస్తుంది.

వివరాల్లోకెళితే.. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్పాకు చెందిన పిలోళ్ల వెంకటేష్‌ 2018 వ సంవత్సరంలో కువైట్‌ వెళ్ళాడు. తరువాత 2020 మార్చిలో తన భార్య స్వాతిని కూడా పనుల నిమిత్తం కువైట్ తీసుకెళ్ళాడు. అక్కడ వెంకటేష్ డ్రైవింగ్ చేస్తూ , స్వాతి ఒక సేట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. స్వాతి కువైట్ వెళ్ళిన వెంటనే 2020 మార్చిన మహ్మద్ అనే వ్యక్తి ఇంట్లో పనిమనిషిగా చేరింది. అక్కడి నుంచి 2021 మార్చి వరకు పని చేసి మానేసింది . అయితే ఆ యజమాని, అతడి భార్య, కుమార్తెలు గత 10 రోజుల క్రితం హత్యకు గురయ్యారు. ఈ మూడు హత్యలను స్వాతి భర్త వెంకటేష్ చేశాడని అక్కడి పోలీసులు అతనిని అనుమానించి ఇదుపులోకి తీసుకుని జైలుకు పంపారు.

ఈ విషయంపై వెంకటేష్ భార్య స్వాతి మాట్లాడుతూ తను మహ్మద్ అనే వక్తి ఇంట్లో పని చేసిన మాట వాస్తవమేనని, తన భర్త వెంకటేష్ కు కువైట్‌లో జరిగిన హత్యలకు ఎటువంటి సంబంధం లేదంటూ విలపిస్తుంది. మహ్మద్(80), అతని భార్య కాల్ద(62), వారి కుమార్తె అసుమ(18) లను వారం క్రితం ఎవరో హత్య చేసి తన భర్త వెంకటేష్‌ పై నింద మోపి జైల్ కు పంపారని అంటుంది. మహ్మద్‌ కు ఆయన రెండవ భార్యతో పాటు బంధువులతో ఉన్న గొడవలే వారి హత్యకు కారణమై ఉంటాయని స్వాతి తెలిపింది. మహ్మద్ భార్య కాల్ద వేరే పని మనిషిని చూడాలంటూ తరచూ వెంకటేష్ కు ఫోన్ చేసేదని అందులో భాగంగా అనుమానితునిగా తీసుకుని వెళ్ళి ఇప్పుడు నేరం తన భర్తపై వేస్తున్నారని స్వాతి విలపిస్తుంది.

వీసా కోసం మాత్రమే అప్పుడప్పుడు హత్యకు గురైన మహ్మద్ ఇంటికి తన భర్త వెళ్ళేవాడని, తనను కూడా ఆరు రోజులు కువైట్ జైల్‌లో ఉంచి చిత్ర హింసలకు గురిచేశారంది. తాను పని చేసే కువైట్ సేట్ లాయర్ కావడంతో జైల్ నుండి తనను విడిపించి పాస్ పోర్ట్‌పై ముద్ర వేసి బలవంతంగా ఇండియాకు పంపిచేశారంటూ స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాంటి తప్పు చేయని తన భర్తని కాపాడాలంటూ కడప జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకుంది.

ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్ళాడు కాని మనుషులను హత్య చేసే అంత దైర్యం చేసే వాడు కాదని, కనీసం ఒక మనిషిని చెడుగా కూడా పిలిచే వాడు కాదన్నారు వెంకటేష్ తల్లిదండ్రులు. తమ ఊరిలోనే ఆటో నడుపుకొంటూ జీవనం సాగించేవాడని, అక్కడ ఏమి జరిగిందో కుడా తమకు తెలియదని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రెండు వారాల ముందు ఫోన్ చేసి పిల్లల యోగ క్షేమాలను అడిగి, వారితో మాట్లాడాడని చెప్పారు. వెంకటేష్ విషయంపై ఇండియా రాయబార కార్యాలయం కాని, కువైట్ అధికారుల నుంచి కానీ తమకు ఎటువంటి సమాచారం లేదని వాపోయారు గ్రామస్తులు. కేవలం సోషల్ మీడియా ద్వారానే తమకు ఈ సమాచారం తెలిసింది తప్ప అధికారంగా ఏం జరిగింది? ఏం జరుగుతుందనేది తమకు తెలియదన్నారు. ఇక తమ కొడుకు వెంకటేష్‌ మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌ కు వెళ్లి అక్కడ ఒకరి ఇంట్లో డ్రైవర్‌గా పనిలో చేరాడన్నారు అతని తల్లిదండ్రులు. రెండేళ్ల తరువాత తన భార్య స్వాతిని కూడా కువైట్‌కు తీసుకెళ్లాడని వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అ పిల్లలకు ఆలనా పాలనా తామే చుస్తున్నామన్నారు. కాని ఒక్కసారిగా ‘‘మీ కొడుకు ఇలా ముగ్గురిని హత్య చేశాడు.’’ అని వార్త విన్నప్పటి నుంచి తాము అనుభవిస్తున్న క్షోభ అంతఇంత కాదని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్ తల్లిదండ్రులు.

తమ కొడుకు నిజంగానే హత్య చేశాడా? అనే కోణంలో విచారించి తమకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను వెంకటేష్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమ కొడుకుకు మరణ శిక్ష వేస్తే ఇద్దరు పిల్లలతో పాటు తమ బతుకు ఆగమైపోతాయని వాపోతున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలిన వేడుకుంటున్నారు. ఇక ఉపాధి నిమిత్తం కువైట్ కు వెళ్ళిన వెంకటేష్ ముగ్గరిని హత్య చేసాడంటే తాము సైతం నమ్మలేకపోతున్నాం అని గ్రామస్తులు అంటున్నారు. వెంకటేష్ చిన్నప్పటి నుంచి కుడా మంచి సంస్కారంతో పెద్దల పట్ల మంచి మర్యాద గలవాడని, అక్కడ ఏం జరిగిందనేదానిపై మన ప్రభుత్వ పెద్దలు చొరవ చూపి వెంకటేష్ కు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కాగా, కువైట్‌లో జైలులో ఉన్న వెంకటేష్ ఈ హత్యలు చేశాడా? లేక సేట్ కు ఉన్న రెండో భార్య కు సంబంధించిన గొడవల వలన హత్య కాబడ్డారా అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా నిందమోపబడి జైలులో ఉన్న వెంకటేష్ కుటుంబం మాత్రం తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం చొరవ చూపి వెంకటేష్ ను విడిపించాలని వారి కుటుంబ సభ్యులు కోరుకుతున్నారు.

Also read:

Viral Video: ఈ తిమింగలం వెరీ స్పెషల్ గురూ.. అడిగి మరీ ముద్దు పెట్టించుకుంటుంది..!

Viral Video: యజమాని కోసం ఇంజనీర్‌గా మారిన కుక్క.. వైరల్ అవుతున్న అద్భుతమైన వీడియో..!

Punjab Congress: సొంత పార్టీపైనే సెటైర్లు వేసిన సిద్ధూ.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!