AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Congress: సొంత పార్టీపైనే సెటైర్లు వేసిన సిద్ధూ.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!

Punjab Congress: సొంత పార్టీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు సిద్ధూ. కాంగ్రెస్‌ అధిష్ఠానమే టార్గెట్‌గా సెటైర్లు వేశారాయన.

Punjab Congress: సొంత పార్టీపైనే సెటైర్లు వేసిన సిద్ధూ.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!
Siddhu
Shiva Prajapati
|

Updated on: Mar 11, 2022 | 7:28 PM

Share

Punjab Congress: సొంత పార్టీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు సిద్ధూ. కాంగ్రెస్‌ అధిష్ఠానమే టార్గెట్‌గా సెటైర్లు వేశారాయన. పంజాబ్‌ ఫలితాలపై నోరువిప్పిన సిద్ధూ.. హాట్‌ కామెంట్స్‌ చేశారు. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ‘ఆప్’ దెబ్బకు ‘హస్తం’ అస్తవ్యస్తమైపోయింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ రిజల్ట్స్‌పై తనదైన శైలిలో స్పందించారు కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు. పంజాబ్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సిద్ధూ.. జనం గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు. ప్రజలు మార్పు కోరుకున్నారని.. ఈ నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. జనం తీర్పును దేవుడి మాటతో పోల్చిన ఆయన.. జనం నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరముందన్నారు.

ఇక సిద్ధూ కామెంట్స్‌పై పొలిటికల్‌ సర్కిళ్లలో విస్తృత చర్చ నడుస్తోంది. అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సిద్ధూ.. ఈ రకంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారని చెబుతున్నారు విశ్లేషకులు. పంజాబ్‌ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారని చెప్పిన సిద్ధూ.. పరోక్షంగా కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేశారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ చీఫ్‌గా నియామకమైన సిద్ధూ.. సీఎం పదవిని ఆశించారు. అనూహ్య రీతిలో అమరీందర్‌ను తప్పించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. సీఎం బాధ్యతల్ని చన్నీకి అప్పజెప్పింది. ఆ తర్వాత కొంత మనస్థాపానికి గురైన సిద్ధూ.. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగానైనా ప్రకటిస్తారని ఆశించారు. అదీ నెరవేరకపోవడంతో అసంతృప్తిగానే ప్రచారం చేపట్టారు. చివరకు ఎన్నికల ఫలితాలు బెడిసికొట్టడంతో తన అసహనాన్ని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు సిద్ధూ. కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయాలు జనానికి నచ్చలేదని.. అందువల్లే ఇలాంటి తీర్పు చెప్పారన్నది సిద్ధూ మాటల్లోని అంతరార్థంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలోనూ సిద్ధూ కాంగ్రెస్‌పై పంచులు వేశారు. సీఎంను పంజాబ్‌ ప్రజలే నిర్ణయిస్తారని.. ఇందులో ఎవరి జోక్యం ఉండబోదంటూ అధిష్ఠానాన్ని టార్గెట్‌ చేశారు.

Also read:

Flying Object: క్రొయేషియాలో కుప్పకూలిన వింత వస్తువు.. కూలిన చోట భారీ గొయ్యి.. UFO అంటూ అనుమానాలు..!

Health Tips: ఈ 11 లక్షణాలను మహిళలు అస్సలు విస్మరించకూడదు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

Andhra Pradesh: ఐదు పదుల వయసులో ఆవహించిన అనుమాన భూతం.. ఎవరితోనో అఫైర్ ఉందంటూ భార్యను..!