Flying Object: క్రొయేషియాలో కుప్పకూలిన వింత వస్తువు.. కూలిన చోట భారీ గొయ్యి.. UFO అంటూ అనుమానాలు..!
Flying Object: క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ శివార్లలో అర్థరాత్రి గుర్తు తెలియని వస్తువు ఒకటి ఆకాశం నుంచి కుప్పకూలింది.
Flying Object: క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ శివార్లలో అర్థరాత్రి గుర్తు తెలియని వస్తువు ఒకటి ఆకాశం నుంచి కుప్పకూలింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం నాడు క్రొయేషియా అధికారులు వెల్లడించారు. కూలిపోయిన వస్తువు గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌కి చెందిన డ్రోన్స్ అని కొందరు అంటుంటే.. చిన్న విమానం అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరైతే ఇది యూఎఫ్ఓ అని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా యూఎఫ్ఓ అంటూ సోషల్ మీడియాలో పలువురు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.
కాగా, అర్థరాత్రి భారీ శబ్ధం రావడంతో స్థానికు హడలిపోయారు. ఇదే అంశంపై స్థానికులకు పోలీసులకు సమాచారం అందించగా.. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అది కూలిన చోట భారీ గొయ్యి పడినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే రెండు పారాచూట్‌లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ పేలుడు కారణంగా అక్కడ పార్క్ చేసిన కొన్ని కార్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ లోహపు ముక్కలు, విమానం రెక్కలను పోలిన శిథిలాలు ఆ ఫోటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, అధికారులు ఈ ప్రాంతాన్ని సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అసలక్కడ ఏం కూలింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. .
నిఘా డ్రోన్ అయిండొచ్చు..! ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కూలిపోయిన ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ శకలాలు నిఘా డ్రోన్‌కు సంబంధించినవని భావిస్తున్నారు. శకలాలను పరిశీలించిన అధికారులు.. ఇవి ఉక్రెయిన్‌కు చెందిన Tu-141 స్ట్రిజ్ నిఘా డ్రోన్‌కు చెందినవిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన ఈ డ్రోన్.. క్రొయేషియాలో కూలిపోయినట్లు గుర్తించారు. Tu-141 సోవియట్ కాలానికి చెందిన హై-స్పీడ్ క్షిపణి లాంటి డ్రోన్. దీనిని ఉక్రెయిన్ ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. దీనిని 1970లో నిర్మించగా.. తరువాత కాలంలో అప్‌గ్రేడ్ చేశారు. దీనిని చాలా సందర్భాలలో ఉపయోగించారు.
— Zdravko Dren (@zdravko_dren) March 11, 2022
Also read:
Health Tips: ఈ 11 లక్షణాలను మహిళలు అస్సలు విస్మరించకూడదు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Andhra Pradesh: ఐదు పదుల వయసులో ఆవహించిన అనుమాన భూతం.. ఎవరితోనో అఫైర్ ఉందంటూ భార్యను..!
UP Elections BJP – MIM: ఎస్పీని ఘోరంగా దెబ్బతీసిన ఎంఐఎం.. బీజేపీకి రూట్ క్లియర్ చేసిందనే టాక్..!