Andhra Pradesh: ఐదు పదుల వయసులో ఆవహించిన అనుమాన భూతం.. ఎవరితోనో అఫైర్ ఉందంటూ భార్యను..!

Andhra Pradesh: అతని వయసు ఐదుపదులు పైనే.. కానీ అడుగడుగునా అనుమానమే..! ఆ అనుమానమే చివరకు అతని భార్య ప్రాణాలను బలితీసుకుంది.

Andhra Pradesh: ఐదు పదుల వయసులో ఆవహించిన అనుమాన భూతం.. ఎవరితోనో అఫైర్ ఉందంటూ భార్యను..!
Visakhapatnam
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 11, 2022 | 5:04 PM

Andhra Pradesh: అతని వయసు ఐదుపదులు పైనే.. కానీ అడుగడుగునా అనుమానమే..! ఆ అనుమానమే చివరకు అతని భార్య ప్రాణాలను బలితీసుకుంది. అత్యంత దారుణంగా భార్యను నరికి చంపి.. ఆపై బావిలో దూకాడు. కనికరం లేకుండా భార్యను నరికి చంపిన అతగాడు.. తన ప్రాణాల మీదకు వచ్చేసరికి ప్రాణ భయంతో బావిలో నుంచి కేకలు పెట్టాడు. తనను రక్షించాలంటూ వేడుకున్నాడు. విశాఖపట్నం జిల్లాలో ఈ దారుణం జరిగింది.

వివరాల్లోకెళితే.. కట్టుకున్న భార్యను కడ తెర్చాడు భర్త. భార్యపై అనుమానం పెంచుకుని నరికి చంపేసాడు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం కుసర్ల పూడికి చెందిన దారపురెడ్డి రమణ, చినబుల్లి భార్యభర్తలు కలిసి జీవిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు కావడంతో వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రమణ, చినబుల్లి కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో భార్య చినబుల్లిపై రమణకు అనుమానం మొదలైంది. ఈ క్రమంలో తరచూ ఇద్దరూ గొడవలు పడేవారు. గత రాత్రి కూడా ఇరువురి మధ్య వివాదం తలెత్తడంతో ఆవేశంతో ఉగిపోయిన రమణ.. కత్తితో భార్యపై దాడి చేశాడు. విచక్షణ రహితంగా నరికి చంపేసాడు. ఆ తరువాత భయంతో రమణ పారిపోతూ సమీపంలో ఉన్న బావిలో దూకేశాడు. భార్యను కనికరం లేకుండా చంపినా.. తన ప్రాణం వరకు వచ్చేసరికి భయపడిపోయాడు రమణ. బావిలోకి దూకినా భయంతో లోపల కర్ర పట్టుకుని ఉండిపోయాడు. రక్షించండంటూ ప్రాణ భయంతో కేకలు వేశాడు. కేకలు విన్న గ్రామస్తులు రమణను బయటకు తీశారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also read:

Dhanashree Verma Chahal: కుర్రకారును ఆకట్టుకుంటున్న అందాల ముద్దుగుమ్మ ‘ధనశ్రీ వర్మ చాహల్’..న్యూ ఫొటోస్..

Punjab Election 2022: పంజాబ్‌ ముఖ్యమంత్రిని ఓడించిన సామాన్యుడు.. అతని గురించి తెలుసా.?

Akhil Agent: అఖిల్‌ ‘ఏజెంట్’ వచ్చేది అప్పుడే.. అధికారిక ప్రకటన చేసిన చిత్ర యూనిట్‌..