YS Jagan: త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన క్యాబినేట్ భేటిలో ఆయన మంత్రివర్గ విస్తరణకు సంబంధించి...

YS Jagan: త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
Cm Jagan
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 11, 2022 | 3:03 PM

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే కేబినేట్ విస్తరణ జరగబోతోంది. ఈ మేరకు తాజాగా సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం జగన్ మంత్రులకు తెలిపారు. మంత్రివర్గం నుంచి తప్పించిన వారు పార్టీకి పని చేయాలంటూ ఈ సందర్భంగా ఆయన వివరించారు. పదవుల నుంచి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది మాత్రమే కేబినేట్‌లో ఉంటారని సీఎం జగన్ స్పష్టం చేశారు. జిల్లాకో మంత్రి ఉండేలా మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందని సమాచారం. ఈ నేపధ్యంలో కేబినేట్ ఎవరెవరు ఉంటారు.? ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఇది ఇలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాల్లో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2లక్షల 56 వేల 257 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీ ముందుంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగో బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టారు.