AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Agent: అఖిల్‌ ‘ఏజెంట్’ వచ్చేది అప్పుడే.. అధికారిక ప్రకటన చేసిన చిత్ర యూనిట్‌..

Akhil Agent: అక్కినేని అఖిల్‌ (Akhil Akkineni) హీరోగా స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఏజెంట్‌. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌తో గతేడాది సూపర్‌ హిట్‌ను అందుకున్న అఖిల్‌, ఇప్పుడు అదే జోరును..

Akhil Agent: అఖిల్‌ 'ఏజెంట్' వచ్చేది అప్పుడే.. అధికారిక ప్రకటన చేసిన చిత్ర యూనిట్‌..
Akhil Agent Moive
Narender Vaitla
|

Updated on: Mar 11, 2022 | 4:46 PM

Share

Akhil Agent: అక్కినేని అఖిల్‌ (Akhil Akkineni) హీరోగా స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఏజెంట్‌. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌తో గతేడాది సూపర్‌ హిట్‌ను అందుకున్న అఖిల్‌, ఇప్పుడు అదే జోరును కొనసాగించేందుకు ఏజెంట్‌ రూపంలో రానున్నాడు. ఇప్పటి వరకు లవర్‌ బాయ్‌గా కనిపించిన అఖిల్‌ తొలిసారి ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో అఖిల్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్లు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో అఖిల్‌ మేకోవర్‌ చూసిన ఆయన ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోయారు.

చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా సాక్షి వైద్య నటిస్తోంది. ఇక ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల తమన్‌ సంగీతం అందించిన దాదాపు అన్ని సినిమాలు విజయాన్ని అందుకుంటుండడంతో ఏజెంట్‌ మ్యూజిక్‌పై కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండడం మరో విశేషం. ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కెరీర్‌లో తొలిసారి పూర్తి స్థాయి యాక్షన్‌ చిత్రంలో నటిస్తోన్న అఖిల్‌ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Also Read: Bandi Sanjay: బీజేపీ అధ్యకుడిగా బండి సంజయ్‌కి రెండేళ్లు.. క‌లిసొచ్చిన అంశాలేమిటి..? ముందున్న స‌వాళ్లేంటి..?

Health Tips: దంత సమస్యలుంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే.

AP DME Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగాలు..