Telangana: సర్కారు బడిలో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి..
Telangana: సర్కారు బడిలో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనకు..
Telangana: సర్కారు బడిలో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనకు సన్నాహాలు షురూ అయ్యాయి. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచే ఇంగ్లిష్ విద్యను బోధించనున్నట్టు చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇదే విషయాన్ని ఆమె శాసనసభలో వెల్లడించారు. 2023 -24 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి, 2024 -25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడతామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాల మేరకు విద్యాశాఖకు ఆదేశాలిచ్చామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మన ఊరు.. మన బడి – మన బస్తీ.. మన బడి కార్యక్రమంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. ఇంగ్లిష్ మీడియాన్ని విప్లవాత్మక మార్పుగా సబితా ఇంద్రారెడ్డి అభివర్ణించారు. తాజా పరిస్థితుల్లో ఇంగ్లిష్ మీడియం హోదాకు చిహ్నంగా మారిందని, ఈ మీడియంలో చదివితేనే ఉద్యోగాలొస్తాయన్న భావన సమాజంలో నెలకొందన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు సైతం కడుపుకట్టుకుని తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారని.. అందరి ఆకాంక్ష మేరకు ఇంగ్లిష్ మీడియాన్ని సర్కారు స్కూళ్లల్లో ప్రారంభిస్తున్నామన్నారు. ఇందుకోసం ద్విభాషా పుస్తకాలను సిద్ధంచేశామని, ఈనెల 14 నుంచి టీచర్లకు శిక్షణనివ్వనున్నామన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 8 నుంచి విద్యాయజ్ఞానికి శ్రీకారం చుట్టామని మంత్రి సభకు వివరించారు. మండలం యూనిట్‌గా అత్యధిక విద్యార్థులు నమోదైన 9,123 స్కూళ్లను మొదటి దశలో ఎంపిక చేశామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. 2 లక్షలు విరాళాలిస్తే ఎస్‌ఎంసీ కమిటీలో సభ్యత్వం, 10 లక్షల విరాళమిస్తే ఒక తరగతి గదికి, 25 లక్షలిస్తే ప్రాథమిక పాఠశాలకు, 50 లక్షలిస్తే ప్రాథమికోన్నత పాఠశాలకు, కోటి రూపాయాలిస్తే ఉన్నత పాఠశాలకు వారి పేర్లు లేదా దాతలు సూచించిన పేర్లను పెడతామన్నారు. ఎంపిక చేసిన స్కూళ్ల పేర్లను మార్చాల్సి వస్తే, సంబంధిత జిల్లాల మంత్రుల్ని సంప్రదించాలని, రెండో దశలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని స్కూళ్లను ఎంపిక చేస్తామన్నారు. త్వరలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, పాత విద్యాకమిటీలనే కొనసాగిస్తామని, మధ్యాహ్న భోజన పథకం బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి.
Also read:
Psychological Stress: మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం ఎలా..? సింపుల్ చిట్కాలు..!
Pooja Hegde: డిఫరెంట్ డ్రెస్సులతో పిచ్చెకిస్తున్న పూజ హెగ్డే.. చూస్తే వావ్ అనాల్సిందే