Kacha Badam Singer: ఆ పరిస్థితి వస్తే మళ్లీ పళ్లీలు అమ్ముతాను.. సెలబ్రిటీ కామెంట్లపై క్షమాపణలు చెప్పిన కచ్చాబాదమ్ సింగర్..
జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని కోట్లు కూడబెట్టినా మన ప్రయాణాన్ని మాత్రం మరవకూడదు.
జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని కోట్లు కూడబెట్టినా మన ప్రయాణాన్ని మాత్రం మరవకూడదు. మనం ఎక్కడినుంచి ప్రారంభమయ్యాయమన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇదెందుకు చెబుతున్నానంటే.. ‘కచ్చా బాదామ్’ సాంగ్ తో ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిపోయాడు భుబన్ బద్యాకర్(Bhuban Badyakar). పచ్చి పల్లీలు అమ్ముకుంటూ సరదాగా పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోన్న సంగతి తెలిసిందే. సామాన్యూల నుంచి సెలెబ్రిటీల వరకు ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇక ఈ పాటతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు భుబన్. బాలీవుడ్‌లో కొందరు సింగర్లు అతనికి మంచి అవకాశాలు ఇస్తున్నారు. డబ్బులు కూడా వస్తున్నాయి. దీంతో ఇటీవలే ఓ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొన్నాడు. కాగా ఇటీవల నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన ఈ బెంగాలీ ఫేమస్ సింగర్.. ‘నేను ఆర్టిస్టుగానే ఉండాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను సెలబ్రెటీగా మారిపోయాను. ఈ స్థితిలో మల్లీ పల్లీలను అమ్మాలనుకోవడం లేదు. ఒకవేళ అమ్మితే అవమానకరంగా ఉంటుంది’ అని భుబన్ బద్యకర్ చెప్పాడు.
కాగా భుబన్ అన్న ఈ మాటలకు నెట్టింట్లో ఆగ్రహం వ్యక్తమైంది. ‘భుబన్‌కు అప్పుడే గర్వం తలకెక్కింది’ అంటూ కొంతమంది నెటిజన్లు అతనిపై విమర్శలు గుప్పించారు. తాజాగా దీనిపై స్పందించిన ఈ బెంగాలీ సింగర్ ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపాడు. తప్పనిసరి అయితే పల్లీలను అమ్ముతానని పేర్కొన్నాడు. ‘ నా నోటి వెంట ఇలాంటి మాటలు వచ్చి ఉండకూడదు. దీనికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ప్రజలే నన్ను సెలబ్రెటీని చేశారు. తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే మరోసారి పల్లీలు అమ్ముతాను. ప్రపంచవ్యాప్తంగా అందరి నుంచి నాకు ప్రేమ లభించింది. అందుకు నేనేంతో అదృష్టవంతుడిని. సెలెబ్రిటీగా మారినప్పటికీ నేను సాధారణ జీవితాన్ని మాత్రమే గడుపుతున్నాను. వ్యక్తిగా నేను ఏ మాత్రం మారలేదు’ అని భుబన్ చెప్పుకొచ్చాడు.
Anand Mahindra: అద్భుతలు ఇలానే ఉంటాయి.. మీరే చూడండి అంటున్న ఆనంద్ మహీంద్రను..(వీడియో)