Viral Video: వేగంగా వెళ్తున్న ట్రక్.. స్టీరింగ్ వదిలేసి డ్రైవర్ డాన్స్‌లు.. అంతలో ఊహించని షాక్..(వీడియో)
కొందరు డ్రైవర్లు తమ వాహనాన్ని అత్యంత వేగంగా నడుపుతూ దూసుకుపోతుంటారు. వారి దుందుడుకు డ్రైవింగ్‌తో వారి ప్రాణాలు మాత్రమే కాదు.. అమాయకుల ప్రాణాలు సైతం ప్రమాదంలో పడేస్తుంటారు.
కొందరు డ్రైవర్లు తమ వాహనాన్ని అత్యంత వేగంగా నడుపుతూ దూసుకుపోతుంటారు. వారి దుందుడుకు డ్రైవింగ్‌తో వారి ప్రాణాలు మాత్రమే కాదు.. అమాయకుల ప్రాణాలు సైతం ప్రమాదంలో పడేస్తుంటారు. కొందరు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీకు ఓ రేంజ్‌లో కోపం రావడం ఖాయం. అరేయ్ ఇంట్రా ఇది అనుకునేలోపు అసలు సిసలైన్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ చూస్తే అప్పటి వరకు ఆవేశంతో ఊగిపోయిన మీరు కోపం, టెన్షన్ అంతాపోయి.. ఓరి నీ ఏషాలో అంటారు.. ఎందుకంటే…
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ లారీ వేగంగా దూసుకెళ్తుంటుంది.. ఇంతలో డ్రైవర్ లారీ స్టీరింగ్‌ని వదిలేసి పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా డ్రైవింగ్ సీట్ నుంచి పక్కకు జరిగి… డోర్ నుంచి బయటకు వంగి రకరకాల విన్యాసాలు చేశాడు. భయానకమైన ఫీట్స్ చేశాడు. ఆ డ్రైవర్ ఫీట్స్‌ని.. లారీలో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. అనంతరం డ్రైవర్ ఆఫోన్ తీసుకుని కెమెరాను ముందువైపు తిప్పాడు. అప్పుడే అసలైన ట్విస్ట్ అర్ధమయింది. లారీ అసలు నడవడం కాదు కదా? కనీసం ఇంజిన్ కూడా ఆన్‌లో లేదని తెలిసింది. నిజానికి కొన్ని ట్రక్కులను గూడ్స్ రైలులో తరలిస్తున్నారు. వాటిలో ఇది ఒకటి. అప్పటి వరకు తానేదో ఫీట్స్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి.. చివరకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ఆ ఫన్నీ డ్రైవర్. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మొత్తానికి ఈ వీడియోను ఇప్పటి వరకు వేలమంది వీక్షిస్తూ లైక్స్‌తో హోరిత్తిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..