మణిపూర్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించిన తీరు ఆనంద్ మహీంద్రాను కట్టిపడేసింది. 2లైన్ల రహదారిలో ఒక వైపు వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకున్నా..లైన్ ధాటి పక్కకు రాకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ట్రాఫిక్ జామ్‌లో ఎలా ప్రవర్తించాలో ఇదే ఉదాహరణ అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ఫోటో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఇది చూసిన నెటిజన్లు సైతం ముచ్చటపడుతున్నారు. వారికి అంతటి సహనం ఎలా వచ్చిందంటూ కొందరు ట్విట్టర్‌లో కామెంట్ చేస్తున్నారు. అందరిలో ఇలా ఆలోచిస్తే అసలు ట్రాఫిక్ జామ్ అన్న మాటే ఉండదంటున్నారు. ఇక ప్రమాదాలకు ఆస్కారం అసలే ఉండదంటూ..భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే, మిజోరంలో కఠినమైన ట్రాఫిక్ జరిమానాలు, శిక్షలు ఉండవు… అక్కడి ప్రభుత్వాలు, పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనలపై పెద్దగా అవగాహన కార్యక్రమాలు చేపట్టవు. కానీ ప్రజలు మాత్రం ఎవరికివారే క్రమశిక్షణగా మసలుకుంటూ మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. మొత్తనికి ఫోటో మాత్రం నెట్టింట వైరల్‌గా మారి దూసుకుపోతోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..