AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai: ప్రాణభయంతో మకాం మార్చాడు.. అయినా మాటు వేసి మట్టుబెట్టిన ప్రత్యర్థులు.. సినిమాను తలపించిన సీన్‌..

తమిళనాడు రాజధాని చైన్నై (Chennai)లో పాతకక్షలు పురివిప్పాయి. రెండు గ్యాంగ్‌లు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ గ్యాంగ్‌వార్‌లో ఒక రౌడీ షీటర్‌ ప్రత్యర్థుల చేతిలో హతమయ్యాడు.

Chennai: ప్రాణభయంతో మకాం మార్చాడు.. అయినా మాటు వేసి మట్టుబెట్టిన ప్రత్యర్థులు.. సినిమాను తలపించిన సీన్‌..
Gangwar
Basha Shek
|

Updated on: Mar 12, 2022 | 8:23 AM

Share

తమిళనాడు రాజధాని చైన్నై (Chennai)లో పాతకక్షలు పురివిప్పాయి. రెండు గ్యాంగ్‌లు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ గ్యాంగ్‌వార్‌లో ఒక రౌడీ షీటర్‌ ప్రత్యర్థుల చేతిలో హతమయ్యాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం…విల్లివాక్కంలోని అగతీశ్వర్ కోయిల్ స్ట్రీట్‌కు చెందిన రంజిత్ అలియాస్ ‘డబుల్’ రంజిత్ (22) హత్య కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రత్యర్థుల భయంతో రెడ్‌హిల్స్‌కు తన మకాం మార్చాడు. అయితే రంజిత్‌ ఆచూకీ తెలుసుకున్న ప్రత్యర్థులు అతనిని ఎలాగైనా మట్టుబెట్టాలని ప్లాన్‌ వేసుకున్నారు.

మాటు వేసి మరీ..

ఇందులో భాగంగా గురువారం సాయంత్రం రంజిత్‌, అతని అనుచరులు మోటారుబైక్‌ పై వెళుతుండగా మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేశారు. రంజిత్‌, అతని అనుచరులు కూడా ఎదరుదాడులకు తెగబడడంతో కొద్ది సేపు విల్లివాక్కంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ప్రత్యర్థుల చేతిలో రౌడీషీటర్‌ రంజిత్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రంజిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కిల్‌పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా కార్తీక్ , ఉదయకుమార్, జయకాంతన్, , శ్రీనివాసన్‌ తో సహా మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read:Khiladi​ Movie: ఓటీటీలోకి వచ్చేసిన మాస్ రాజా ఖిలాడి.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

Tollywood: సక్సెస్ మంత్ర.. ఫిమేల్ లీడ్‌ మీదే బాగా హోప్స్ పెట్టుకుంటున్న కుర్ర హీరోలు..

Hyderabad: ప్రయాణికులకు అలెర్ట్‌.. నేడు, రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..