AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సక్సెస్ మంత్ర.. ఫిమేల్ లీడ్‌ మీదే బాగా హోప్స్ పెట్టుకుంటున్న కుర్ర హీరోలు..

సోలోగా మూడుసార్లు ఎఫర్ట్‌ పెట్టినా సక్సెస్ కొట్టలేక దిగాలుపడ్డారు అక్కినేని హీరో అఖిల్. చివరాఖరికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఫోర్త్ ఎటెంప్ట్‌లో హిట్టు దక్కించుకుని హైవే మీదకొచ్చేశారు. ఇలా

Tollywood: సక్సెస్ మంత్ర.. ఫిమేల్ లీడ్‌ మీదే బాగా హోప్స్ పెట్టుకుంటున్న కుర్ర హీరోలు..
Tollywood Young Heros
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2022 | 7:46 AM

Share

Tollywood: సోలోగా మూడుసార్లు ఎఫర్ట్‌ పెట్టినా సక్సెస్ కొట్టలేక దిగాలుపడ్డారు అక్కినేని హీరో అఖిల్. చివరాఖరికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఫోర్త్ ఎటెంప్ట్‌లో హిట్టు దక్కించుకుని హైవే మీదకొచ్చేశారు. ఇలా సిసింద్రీ గట్టెక్కడానికి ఎన్ని కారణాలైనా వుండొచ్చు. వాటిలో బుట్టబొమ్మ గ్లామర్‌ డోస్‌ కూడా మెయిన్‌ రీజనే. బిగ్‌ ఫిమేల్ స్టార్స్ చెయ్యిపట్టుకుని విక్టరీ కోసం కొత్తగా ట్రై చేయడం కుర్ర హీరోలకు ఇప్పుడో ట్రెండ్‌గా మారింది. గాడి తప్పిన కెరీర్‌ని పట్టాలెక్కించి మళ్లీ మెయిన్‌ స్ట్రీమ్‌లోకి రావాలని తపన పడుతున్నారు హీరో శర్వానంద్‌. అందుకే… ఈసారి ఆడాళ్లూ మీకు జోహార్లు అంటూ కొత్త టెక్నిక్‌ షురూ చేశారు. నేషనల్‌ క్రష్‌గా ఎలివేట్ అయిన రష్మికను జోడీగా సెట్ చేసుకున్నారు.  ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తోనైనా హిట్‌ ఫ్లేవర్‌ని టేస్ట్  చేశాడు ఈ కుర్ర హీరో

మరో యంగ్ అండ్ వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ కూడా ఫిమేల్ లీడ్‌ మీదే బాగా హోప్స్ పెట్టుకున్నారు. ఒకప్పుడు స్టార్‌ హీరోలకు లక్కీ మస్కట్‌ అనిపించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడీ మినీ స్టార్‌ని టేకప్ చేశారు. నాగశేఖర్ డైరెక్ట్ చేస్తున్న క్యూట్‌ లవ్‌స్టోరీ గుర్తుందా శీతాకాలంలో సత్యదేవ్ హీరోయిజంతో పాటు తమ్మూ గ్లామర్‌ అప్పీల్ కూడా మరో హైలైట్ కాబోతోంది. మలయాళ యువనటుడు దుల్కర్ సల్కాన్‌ కూడా హే సినామికా అంటూ.. ఫర్‌ ది ఫస్ట్‌టైమ్. ఫస్ట్‌క్లాస్ హీరోయిన్‌తో రొమాన్స్‌లో దిగేశారు. బృంద డైరెక్ట్ చేస్తున్న హే సినామికా సినిమా కథను కాజల్‌ని దృష్టిలో పెట్టుకునే రాశారట మదన్‌ కార్కీ. సో.. మహానటి తర్వాత దుల్కర్‌కి మరోసారి పాన్ సౌత్ విక్టరీని ఖాయం చేస్తున్నారు టాలీవుడ్ చందమామ. శాకుంతలం, యశోద లాంటి ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలతో సమంత, రాంగీ లాంటి పక్కా యాక్షన్‌ డ్రామాతో త్రిష.. ఇలా కొందరు సోలో సినిమాలతో బిజీగా వుంటే.. మిగతా స్టార్‌ హీరోయిన్లు మాత్రం ప్లాన్‌బీ కూడా అమలు చేస్తున్నారు. టాప్‌ ఛెయిర్స్‌లో వుంటూనే… అడపాదడపా మిడిల్‌ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ వాళ్ల ఫేట్‌ మార్చే బాధ్యతను భుజానికెత్తుకున్నారన్న మాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: డిఫరెంట్ డ్రెస్సులతో పిచ్చెకిస్తున్న పూజ హెగ్డే.. చూస్తే వావ్ అనాల్సిందే

Surbhi: సరికొత్త లుక్ లో అందాల భామ సురభి… నెట్టింట ఫోటోస్ వైరల్

Radhe Shyam: రాధేశ్యామ్‌ స్లోగా ఉందన్న వారికి.. అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన థమన్‌.. వైరల్‌ అవుతోన్న మీమ్‌..