Hyderabad: ప్రయాణికులకు అలెర్ట్‌.. నేడు, రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..

Cancellation of MMTS: హైదరాబాద్‌ నగర్ ప్రయాణికులకు బిగ్‌ అలెర్ట్‌. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగర పరిధిలోని పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది.

Hyderabad: ప్రయాణికులకు అలెర్ట్‌.. నేడు, రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..
Follow us

|

Updated on: Mar 12, 2022 | 7:09 AM

Cancellation of MMTS: హైదరాబాద్‌ నగర్ ప్రయాణికులకు బిగ్‌ అలెర్ట్‌. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగర పరిధిలోని పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. నేడు (మార్చి12) , రేపు (మార్చి13) మొత్తం రెండు రోజుల పాటు మొత్తం 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. లింగంపల్లి – హైదరాబాద్, హైదరాబాద్‌ – లింగంపల్లి, ఫలక్‌ నుమా – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్‌ నుమా మార్గాల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాగా రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లి- హైదరాబాద్‌ మార్గంలో 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు అదేవిధంగా హైదరాబాద్‌- లింగంపల్లి రూట్లోనూ 9 రైళ్లును అధికారులు రద్దు చేశారు. 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబర్ గల రైళ్లు రద్దు అయ్యాయి.

ఇక ఫలక్‌నుమా- లింగంపల్లి మార్గంలో 47153, 47164, 47165, 47216, 47166, 47203, 47220, 47170 నంబర్ గల ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దయ్యాయి. లింగంపల్లి- ఫలక్‌నుమా మార్గంలోనూ 8 రైళ్లు రద్దు అయ్యాయి. 47176, 47189, 47186, 47210, 47187, 47190, 47191, 47192 నంబర్ గల రైళ్లు నిలిచిపోనున్నాయి. సికింద్రాబాద్‌- లింగంపల్లి మార్గంలో47150 నంబర్ గల ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసును రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక లింగంపల్లి- సికింద్రాబాద్‌ మార్గంలో 47195 నంబర్ గల ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసును కూడా రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

Also Read:Russia – Ukraine War: ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ యువతి.. ఎందుకోసమంటే..!

Gold Price Today: గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. స్థిరంగా బంగారం ధరలు.. అక్కడ మాత్రం భారీ పెరుగుదల.

Telangana: సర్కారు బడిలో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి..