AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khiladi​ Movie: ఓటీటీలోకి వచ్చేసిన మాస్ రాజా ఖిలాడి.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

రవితేజ నటించిన ఖిలాడి సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..రమేష్ వర్మ(RameshVarma) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Khiladi​ Movie: ఓటీటీలోకి వచ్చేసిన మాస్ రాజా ఖిలాడి.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
Khiladi
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2022 | 7:48 AM

Share

Khiladi​ Movie: రవితేజ నటించిన ఖిలాడి సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..రమేష్ వర్మ(RameshVarma) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా తర్వాత రవితేజ నుంచి వచ్చిన రెండో సినిమా ఇది. ఈ సినిమా కంటే ముందు క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. అదే జోష్ లో ఖిలాడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి(Dimple Hayathi) హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. పోస్టర్స్ దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది. మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఈ సినిమాకి దేవిశ్రీ స్వరాలను అందించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదిక పై సందడి చేస్తుంది.

ఇప్పటికే అఖండ, పుష్ప, డీజే టిల్లు వంటి సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు ఖిలాడి మూవీ కూడా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో మార్చి 11 సాయంత్రం 6 గంటలనుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ పోస్టర్ ను వదిలారు. మరి ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఖిలాడి సినిమాలో చిన్ ఖేడ్కర్ .. ముఖేశ్ రుషి, రావు రమేశ్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: డిఫరెంట్ డ్రెస్సులతో పిచ్చెకిస్తున్న పూజ హెగ్డే.. చూస్తే వావ్ అనాల్సిందే

Surbhi: సరికొత్త లుక్ లో అందాల భామ సురభి… నెట్టింట ఫోటోస్ వైరల్

Radhe Shyam: రాధేశ్యామ్‌ స్లోగా ఉందన్న వారికి.. అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన థమన్‌.. వైరల్‌ అవుతోన్న మీమ్‌..

Follow Us
కరెంట్ బిల్లు పెరగడానికి అదే కారణం కావచ్చు!
కరెంట్ బిల్లు పెరగడానికి అదే కారణం కావచ్చు!
ఫ్రిజ్, ఏసీలో ఈ చిన్న సెట్టింగ్స్‌తో కరెంట్ బిల్లును సగానికి సగం
ఫ్రిజ్, ఏసీలో ఈ చిన్న సెట్టింగ్స్‌తో కరెంట్ బిల్లును సగానికి సగం
కుండీలో రాత్ కీ రాణి మొక్కను ఇలా పెంచితే.. మీ ఇల్లు రాత్రంతా
కుండీలో రాత్ కీ రాణి మొక్కను ఇలా పెంచితే.. మీ ఇల్లు రాత్రంతా
కిటికీలు, అద్దాలపై మరకలు పోవడం లేదా? ఈ పొడితో మొత్తం క్లీన్!
కిటికీలు, అద్దాలపై మరకలు పోవడం లేదా? ఈ పొడితో మొత్తం క్లీన్!
సాంబార్, పసుపు మరకలతో లంచ్ బాక్స్ పాడైందా? ఇలా క్లీన్ చేయండి!
సాంబార్, పసుపు మరకలతో లంచ్ బాక్స్ పాడైందా? ఇలా క్లీన్ చేయండి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!