ESIC SSO Recruitment 2022: ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? నెలకు లక్షకుపైగా జీతంతో ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు..రేపే ఆఖరు..
భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC).. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల (Social Security Officer Posts) భర్తీకి..
ESIC Social Security Officer Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC).. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల (Social Security Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య: 93
పోస్టుల వివరాలు: సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/మేనేజర్ గ్రేడ్ 2/సూపరింటెండెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 12, 2022 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.44,900ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కామర్స్/లా/మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: రాత పరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్స్), స్కిల్, డిస్క్రిప్టివ్ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.500 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.250
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 13, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: