Poland: ఆ దేశ పౌరులు భారత దేశ మహారాజుని తండ్రిగా భావిస్తారు.. ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు ఎందుకంటే…

Poland: భారతదేశం 'వసుధైవ కుటుంబం' అనే ఆలోచనను విశ్వసిస్తుంది. అందుకనే అనేక మతాల, సంప్రదాయాల ప్రజలు ఎంతో సంతోషంగా ఐక్యంగా జీవిస్తారు. అంతేకాదు మనదేశానికి ఆశ్రయం కోసం వచ్చిన ఇతర దేశాలవారిని..

Poland: ఆ దేశ పౌరులు భారత దేశ మహారాజుని తండ్రిగా భావిస్తారు..  ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు ఎందుకంటే...
Digvijaysinhji Ranjitsinhji
Follow us

|

Updated on: Mar 12, 2022 | 12:25 PM

Poland: భారతదేశం ‘వసుధైవ కుటుంబం’ అనే ఆలోచనను విశ్వసిస్తుంది. అందుకనే అనేక మతాల, సంప్రదాయాల ప్రజలు ఎంతో సంతోషంగా ఐక్యంగా జీవిస్తారు. అంతేకాదు మనదేశానికి ఆశ్రయం కోసం వచ్చిన ఇతర దేశాలవారిని.. అతిథి దేవోభవ అంటూ ఆదరిస్తారు. వారిని సొంత ఇంటి బిడ్డలా చూసుకుంటారు. అందుకనే ఇజ్రాయిల్(Israel) వంటి దేశం భారతదేశాన్ని(Bharath), భారతీయులను ఎంతగానో ప్రేమిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇజ్రాయిల్ కి ఏమాత్రం తీసిపోని విధంగా మరో దేశం భారతదేశాన్ని ప్రేమిస్తుంది. భారతీయులను గౌరవిస్తుంది. ఎంతగా అంటే..  భారతీయులు కోర్టులో గీతని ప్రమాణంగా తీసుకుంటారో.. అదే విధంగా ఆ దేశంలో మన భారత దేశంలోని ఒక ప్రాంతాన్ని పాలించిన రాజు పేరుని ప్రమాణంగా తీసుకునేటంత గౌరవం.. ఆ దేశంలోని అనేక రోడ్లు, పాఠశాలకు మహారాజా పేరు పెట్టుకున్నారు.. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయులకు, విద్యార్థులకు తమ దేశంలో ఆశ్రయం ఇస్తూ.. మరోసారి తమకు భారతీయుల మీద ఉన్న ప్రేమను ఇష్టాన్ని చాటుకున్నారు.  ఆ దేశంలో మనదేశ మహారాజుని దూషిస్తే ఏకంగా మరణశిక్ష విధిస్తారు. కానీ మనకు ఆ మహారాజు ఎవరో మనకు చరిత్ర చెప్పని పాఠం.. ఆ గొప్ప మహారాజు గురించి ఆ దేశం ఎందుకు అంతగా ప్రేమిస్తుంది పూజిస్తుంది..పోలెండ్‌కు దూరంగా నివసించిన ఒక భారత పాలకుడు ఆ దేశం  గౌరవాన్ని ఎలా సంపాదించాడు.  నేటికీ వారు గుర్తుంచుకునే విధానం గురించి తెలుసుకుందాం.

యురేపియన్ దేశాల్లో ఒకటి పోలాండ్. పోలాండ్‌లోని రాజధాని వార్సా రాజధానిలో అనేక రోడ్లు, పాఠశాలలకు జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా పేరు పెట్టారు. పోలాండ్ కు భారతదేశం అంత ఎందుకు అంత మమకారం? ఏ రకంగా వారిని మనం కాపాడం? ఇజ్రాయిల్ లాగానే పోలాండ్ వాసుల ఒకప్పటి ధయనీయమైన కధ? ఏమిటంటే.. పోలాండ్‌పై హిట్లర్  రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభించినప్పుడు… ఆ సమయంలో పోలెండ్ సైనికులు తమ దేశానికి చెందిన సుమారు 640 ఓ మంది శరణార్థులు సముద్రంలోని ఓ ఓడలో పెట్టి ప్రాణాలతో బయటపడమని పంచించారు. వారిలో మహిళలు,  పిల్లలు ఉన్నారు. ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని పోలెండ్ కెప్టెన్‌కి చెప్పారు. ప్రాణం ఉంటే… బతికితే, బతికినా మళ్లీ కలుద్దాం!

అలా పోలెండ్ శణార్థులతో నిండిన ఓడ ఇరాన్‌లోని ఓడరేవుకు చేరుకుంది. అయితే వారు ఆశ్రయం ఇవ్వలేదు.. అనంతరం అదాన్‌లో ఆగారు.. అక్కడ కూడా వారికి ఉండడానికి అనుమతి ఇవ్వలేదు.  అలా ఓడ  సముద్రంలో తిరుగుతూ గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఒడ్డుకు చేరుకుంది.

1941లో గుజరాత్‌కు చేరుకున్న తర్వాత,  మహారాజా జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్ వారికీ ఆశ్రయం ఇచ్చారు. అంతేకాదు  జామ్‌నగర్‌లోని బాలచాడి అనే గ్రామంలోని శిబిరాల్లో బస ఏర్పాటు చేశారు. వారికి ఆహారం, వసతి కల్పించారు. పిల్లలను బాలచాడిలోని సైనిక స్కూల్ లో చదివించే ఏర్పాటు చేశారు. అంతేకాదు వారి సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా ఉంచేలా మహారాజావారు ప్రయత్నం చేశారు.

మహారాజు పిల్లలతో, “మీకు మీ తల్లిదండ్రులు లేకపోవచ్చు, కానీ నేను ఇప్పుడు మీ తండ్రిని” అని చెప్పాడు. పోలెండ్ నుంచి వచ్చిన చిన్న పిల్లలు మహారాజుని “మా బాపు” (“నాన్న”) అని పిలిచారు. ఈ శరణార్థులు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ సుమారు తొమ్మిదేళ్లు జామ్‌నగర్‌లో ఉన్నారు. ఆ తొమ్మిదేళ్లు శిబిరాలను స్వయంగా సందర్శిస్తూ.. జామ్ సాహెబ్ వారిని బాగా చూసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత గ్రేట్ బ్రిటన్..  పోలాండ్ ప్రభుత్వాన్ని గుర్తించిన తరువాత, శరణార్థులు పోలాండ్‌కు తిరిగి రావాలని కోరారు. దీంతో మనదేశంలోని శరణానార్ధులు తిరిగి స్వదేశం చేరుకున్నారు. ఆయుధాలు ఇచ్చి పోలాండ్‌కు పంపారు.

అదే శరణార్థి పిల్లల్లో ఒకరు కాలక్రమంలో పోలాండ్ ప్రధాని అయ్యారు. మానవత్వంతో మహారాజు చేసిన  నిస్వార్థ కృషికి, మహారాజా జామ్ సాహెబ్‌కు పోలాండ్ అత్యున్నత గౌరవమైన రాష్ట్రపతి పతకం ఇచ్చి గౌరవించింది. పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు మహారాజా జామ్ సాహబ్ పేరు పెట్టారు.పోలాండ్‌లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. ప్రతి సంవత్సరం పోలాండ్ వార్తాపత్రికలలో మహారాజా జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్ గారి గురించి కథనం ప్రచురించబడుతుంది.  భారత, పోలెండ్ ప్రభుత్వాల సహకారంతో “లిటిల్ పోలాండ్ ఇన్ ఇండియా” అనే డాక్యుమెంటరీ కూడా రూపొందించారు. నేటికీ ప్రతి సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్‌నగర్‌కు వచ్చి తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు.

నేటికీ పోలాండ్ ప్రజలు వారిని ఆహార ప్రదాతలుగా పరిగణిస్తున్నారు. వారి రాజ్యాంగం ప్రకారం, జామ్ దిగ్విజయ్ సింగ్ గారు వారికి దేవుడు లాంటివాడు. అందుకే నేటికీ జామ్ దిగ్విజయ్ సింగ్ సాక్షులుగా పరిగణిస్తూ నేతలు పార్లమెంట్‌లో ప్రమాణం చేస్తారు. భారతదేశంలో దిగ్విజయ్ సింగ్  ని అవమానిస్తే, పోలెండ్ లో దారుణమైన శిక్షను విధిస్తారు.

Also Read:

 YSR Party Anniversary: మూడు దశాబ్ధాలు జగన్మోహన్ రెడ్డే సీఎం.. ఏపీ మంత్రి ఆదిమూలపు వ్యాఖ్యలు