Viral Video: వీళ్లు పిల్లలు కాదు..పిడుగులు కాదు…అంతకు మించి..! వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది వైరల్‌గా మారుతుందో చెప్పలేం. నెటిజన్లు నిత్యం అనేక వీడియోలను షేర్ చేస్తుంటారు. వాటిలో ఎన్నో ఫన్నీ వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆలరిస్తుంటాయి. కొన్ని వీడియోలను మళ్లీ మళ్లీ చూడాలానిపిస్తుంటుంది.
: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది వైరల్‌గా మారుతుందో చెప్పలేం. నెటిజన్లు నిత్యం అనేక వీడియోలను షేర్ చేస్తుంటారు. వాటిలో ఎన్నో ఫన్నీ వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆలరిస్తుంటాయి. కొన్ని వీడియోలను మళ్లీ మళ్లీ చూడాలానిపిస్తుంటుంది. ప్రత్యేకించి అద్భుతమైన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో కొందరు చిన్నారులు ఊహించని రీతిలో స్కేటింగ్ చేస్తూ అందరిని అబ్బురపరుస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ముగ్గురు చిన్నారులు స్కేటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వారు ముగ్గురు అక్కడ ఉన్న ఓ ఎత్తయిన గోడపైకి ఎక్కుతారు. ఆ ముగ్గురిలో ఒక బాలుడు మొదట గోడపైకి ఎక్కుతాడు. ఒక చిన్నా గోడ ఎక్కలేకపోవడంలో మరో బాలుడు మోకాళ్లపై కూర్చుని తన భుజాలమీదుగా ఆ చిన్నారిని గోడపైకి ఎక్కిస్తాడు. ఆ తర్వాత తను కూడా ఆ గోడపైకి ఎక్కుతారు. ఇప్పుడు ఆ ఎత్తయిన గోడపైనుంచి ముగ్గురూ ఒక్కసారిగా స్కేటింగ్ చేసుకుంటూ కిందకి దిగి రోడ్డుమీదుగా దూసుకుపోతారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు వీళ్లు పిల్లలు కాదు పిడుగులు అంటున్నారు. చిన్నారుల స్కేటింగ్ స్కిల్స్ చూసి అబ్బురపడిపోతున్నారు. వారిపై ప్రశంలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోనూ మీరూ ఓసారి చూసేయండి…
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..