AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BellamKonda Suresh: చీటింగ్‌ కేసుపై స్పందించిన బెల్లంకొండ సురేష్‌.. ఇదంతా ఓ రాజకీయ నాయకుడి కుట్రేనంటూ..

BellamKonda Suresh: ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్‌, ఆయన తనయుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Srinivas)పై చీటింగ్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

BellamKonda Suresh: చీటింగ్‌ కేసుపై స్పందించిన బెల్లంకొండ సురేష్‌.. ఇదంతా ఓ రాజకీయ నాయకుడి కుట్రేనంటూ..
Bellamkonda Suresh
Basha Shek
|

Updated on: Mar 12, 2022 | 12:53 PM

Share

BellamKonda Suresh: ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్‌, ఆయన తనయుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Srinivas)పై చీటింగ్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమా నిర్మిస్తానంటూ బెల్లంకొండ సురేష్‌, శ్రీను తన వద్ద భారీగా డబ్బులు తీసుకున్నారని, నాలుగేళ్లు గడుస్తోన్నా తిరిగి ఇవ్వడం లేదని శరణ్‌ అనే ఒక వ్యక్తి కోర్టు మెట్లెక్కాడు. ఫిర్యాదు స్వీకరించిన నాంపల్లి కోర్టు తండ్రీ, కొడుకులు ఇద్దరిపై కేసు నమోదు చేయాలని సీసీఎస్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంపై బెల్లంకొండ సురేష్‌ (BellamKonda Suresh) స్పందించారు. తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొందరు కావాలనే తనపై కుట్ర పన్నుతున్నారని, పోలీసుల విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. ‘నన్ను, నా ఫ్యామిలీ ని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది కుట్ర పన్నుతున్నారు. అందులో భాగమే నాపై నమోదైన ఈ కేసు. నాకు శరన్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు చూపించాలి. లేకపోతే అతనిపై పరువునష్టం దావా వేస్తాను’

బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు..

‘నా ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కొందరు నాపై ఇలా కేసులు పెడుతున్నారు. నన్ను బ్యాడ్‌ చేయడానికి శరణ్ ఈ ఆరోపణలు చేశారు. అతనితో పాటు మరికొంత మంది ఈ కుట్రలో పాలుపంచుకుంటున్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తాను. నాకు కోర్టు నుంచి కాని సీసీఎస్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని శరణకే నోటీసులు ఇచ్చారు. శరణ్ ది మా ఊరే. పదేళ్ల క్రితం పరిచయమయ్యాడు. సినిమా టికెట్ల కోసం అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇలా నాపై ఆరోపణలు చేస్తున్నాడు. అనవసరంగా నా కొడుకు పేరును చెడగొడుతున్నాడు. నా పంచ ప్రాణాలైన నా పిల్లల జోలికొచ్చిన అతడిని క్షమించే ప్రసక్తి లేదు. లీగల్‌గానే శరణ్‌ను ఎదుర్కొంటాను. అతని వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు. త్వరలోనే అతని పేరు బయట పెడతాను ‘ అంటూ చెప్పుకొచ్చారు బెల్లంకొండ సురేష్‌.

Also Read:Viral Video: ల్యాప్ టాప్‌లో నిమగ్నమైన వ్యక్తి.. వెనుక విషపూరితమైన పులి పాము.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో వైరల్

Viral: మీ కళ్లకి ఒక పరీక్ష.. ఈ ఫొటోలో దాగి ఉన్న సంఖ్యని కనుక్కుంటే మీరు తోపే.. అన్నట్లు అందులోనే ఒక క్లూ కూడా ఉందండోయ్‌..

CBSE 10th Class term 1 Result 2021: సీబీఎస్సీ 10వ తరగతి టర్మ్‌ 1 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఎలా చెక్ చేసుకోవాలంటే..