Jammu and Kashmir: కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌.. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు..

ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

Jammu and Kashmir: కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌.. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు..
Kashmir Encounter
Follow us
Basha Shek

|

Updated on: Mar 12, 2022 | 1:25 PM

ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కాగా ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir) పోలీసులు తెలిపారు. ‘ నిన్న రాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లో నాలుగైదు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాం. ఇప్పటివరకు పుల్వామాలో ఒక పాకిస్థానీతో సహా జైషే మహ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, గండర్‌బాల్, హంద్వారాలో ఒక్కొక్క ఉగ్రవాదిని మట్టుబెట్టాం. హంద్వారా, పుల్వామాలోనూ ఎన్‌కౌంటర్లు జరిగాయి. అలాగే ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాం’ అని జమ్మూ కశ్మీర్ ఐజీ శనివారం ట్విట్టర్‌లో తెలిపారు. ఇక గండర్‌బాల్ జిల్లాలోని సెర్చ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అదేవిధంగా దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని చెవా కలాన్ ప్రాంతంలో రాత్రిపూట జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదులను ఇంకా గుర్తించాల్సి ఉంది’ అని పోలీసులు తెలిపారు.

కశ్మీర్‌ లో హై అలెర్ట్‌..ఇక హంద్వారాలోని నెచామా, రాజ్‌వార్ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో కూడా ఒక ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాదుల గాలింపు కోసం పలుచోట్ల సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. కాగా జమ్ముకశ్మీర్‌లో శనివారం ఉదయం హైఅలర్ట్‌ ప్రకటించారు భద్రతా అధికారులు. అదేవిధంగా సెర్చ్‌ ఆపరేషన్‌ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రవాణా ఆగిపోయింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సామాన్య పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Also Read: Sajjala slams TDP: మాకు ముందస్తు ఎన్నికలు అవసరం లేదు.. అనవసర ప్రచారం వద్దు

Andhra Pradesh: ఊరు చివర నుంచి రాత్రి పూట చప్పుళ్లు.. పొద్దున్నే వెళ్లి చూసిన గ్రామస్థులు షాక్

Andhra Pradesh: మత్స్యకారులకు వలకి చిక్కిన అరుదైన చేప.. ధర ఎంత పలికిందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే