AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్‏తో ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తమన్..

దాదాపు మూడేళ్ల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనిపిచండంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చాలా కాలం తర్వాత మాస్

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్‏తో ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తమన్..
Taman
Rajitha Chanti
|

Updated on: Mar 12, 2022 | 3:07 PM

Share

దాదాపు మూడేళ్ల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనిపిచండంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్‏ను పూర్తిగా పక్కన పెట్టేసి లవర్ బాయ్‏గా మారిపోయాడు డార్లింగ్.. అందమైన ప్రేమకథతో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు రాధేశ్యామ్ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉండగా.. మార్చి 11న విడుదలైన ఈ సినిమా గురించి పబ్లిక్ టాక్ మాత్రం ఆశించినంతగా రావడం లేదు. బాహుబలి .. సాహో సినిమాలో మాస్ యాంగిల్‏లో కనిపించిన ప్రభాస్.. సైలెంట్ ప్రేమికుడిగా మారిపోవడంతో కొందరు మాత్రం రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో రాధేశ్యామ్ సినిమాపై ట్రోల్స్ నడుస్తున్నాయి.

సినిమా బాగా స్లోగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజువల్స్.. ప్రభాస్ యాక్టింగ్ బాగున్నా… అక్కడక్కడ డైరెక్షన్ సరిగ్గా లేదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే..రాధేశ్యామ్ సినిమాపై వస్తోన్న నెగిటివ్ కామెంట్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ స్పందించాడు. తాజాగా ఓ మీమ్ పై తనదైన స్టైల్లో కౌంటర్ వేశాడు థమన్. అందులో ఏముందంటే.. ” సినిమా బాగా స్లోగా ఉందని అంటే.. లవ్ స్టోరీ అంటే స్లోగా కాకుండా.. ఫస్ట్ హాఫ్‏లో ఫస్ట్ నైట్.. సెకండ్ హాఫ్ లో సెకండ్ సెటప్ పెట్టాలా ఏంటీ ? ” అని ఉంది. అది చూసిన తమన్.. బ్లాక్ బస్టర్ రాధేశ్యామ్ అనే హ్యాష్ ట్యాగ్‏తో తమన్ ట్వీట్ చేశాడు. స్లో అంట.. నువ్వు పరిగెత్తాల్సిందే అదిరింది మీమ్ అంటూ సమాధానమిచ్చాడు..

ట్వీట్..

Also Read: Samantha And Varun Dhawan: సామ్‌కు ఎస్కార్టులా మారిపోయిన బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

Jacqueline Fernandez: చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న వయ్యారాలు వలకబోస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..

Anasuya Bharadwaj: బుల్లితెర అయిన వెండితెరకు అయిన తగ్గని అందాల ‘అనసూయ’ జోరు..(ఫొటోస్)

BellamKonda Suresh: చీటింగ్‌ కేసుపై స్పందించిన బెల్లంకొండ సురేష్‌.. ఇదంతా ఓ రాజకీయ నాయకుడి కుట్రేనంటూ..