Food Coma: భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకో తెలుసుకోండి
Food For Sleep: మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఆహారంలో, జీవనశైలిలో మార్పులు అవసరం. అయితే.. చాలా మంది ఎక్కువ భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు.
Food For Sleep: మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఆహారంలో, జీవనశైలిలో మార్పులు అవసరం. అయితే.. చాలా మంది ఎక్కువ భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. ప్రజలు దీనిని సాధారణ విషయంగా భావించినప్పటికీ.. ఇది ఏమాత్రం మంచిది కాదు. తినంగానే నిద్రపోయే పరిస్థితిని ఫుడ్ కోమా అంటారు. వైద్య భాషలో ఈ సమస్యను పోస్ట్‌ప్రాండియల్ సోమనోలెన్స్ అంటారు. ఈ వ్యాధిలో అతిగా తినడం వల్ల, నిద్రతోపాటు అలసట అనిపిస్తుంది. శరీరంలో బద్ధకం రావడం మొదలవుతుంది.. ఏ పనీ చేయాలని అనిపించదు. తిన్న తర్వాత రక్తప్రసరణలో వచ్చే మార్పుల వల్ల ఈ సమస్య వస్తుందని, ఆందోళన చెందాల్సిన పని లేదని నిపుణులు పేర్కొంటున్నారు. నిరంతరం ఏకాగ్రతతో ఉండాలనుకుంటే.. ఇలాంటి దానికి, ఆహార పద్దతులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ కవల్జిత్ సింగ్ మాట్లాడుతూ.. ఫుడ్ కోమా గురించి నిర్దిష్ట కారణాలేవీ వెల్లడి కాలేదన్నారు. కొన్ని పరిశోధనల్లో తేలినప్పటికీ, తిన్న తర్వాత, కడుపులో రక్త ప్రసరణ పెరగడం వల్ల, మెదడుకు రక్తం తక్కువగా చేరుతుందని, దీని కారణంగా ఇలా జరుగుతుందన్నారు. అయితే, ఈ సిద్ధాంతం కూడా స్పష్టంగా నిరూపించబడలేదని పేర్కొన్నారు. ఎక్కువగా తినేవారిలో ఈ సమస్య కనిపిపిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆహారంలో తీసుకునే వాటిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే, ఫుడ్ కోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొవ్వు శరీరంలో కొలిసిస్టోకినిన్ అనే హార్మోన్ మొత్తాన్ని పెంచుతుంది, ఇది నిద్రపోవడానికి దారితీస్తుంది.
ఆహారంలో ఎక్కువ ప్రొటీన్లు ఉన్నా కూడా సమస్యే అని డాక్టర్ పేర్కొన్నారు. ట్రిప్టోఫాన్ అనేది అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలలో కనిపించే అమైనో ఆమ్లం. ట్రిప్టోఫాన్ ఎక్కువైతే శరీరంలో సెరోటోనిన్ స్థాయి పెరుగుతుంది. దీని తరువాత నిద్ర వస్తుంది. ఎవరైనా సాధారణంగా ఆహారం తిన్న తర్వాత కూడా నిద్రపోతున్నట్లు అనిపిస్తే ఇదీ కూడా మధుమేహానికి సంకేతం. ఇలాంటి పరిస్థితిలో మీరు రక్తంలో చక్కెరను కూడా పరీక్షించుకోవాలి. పరీక్షలో షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే.. ఈ సమస్య ఫుడ్ కోమా వల్ల కాదని మధుమేహం వల్ల వచ్చిందని అర్థం.
ఫుడ్ కోమాను ఎలా నివారించాలి
ఎల్లప్పుడూ సమతుల్య ఆహారాన్ని అనుసరించాలి.
అతిగా ఎప్పుడూ కూడా తినొద్దు.
అనారోగ్యకరమైన ఆహారం అస్సలు తినవద్దు
రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలి
మీరు తిన్న తర్వాత నిద్రపోతున్నట్లు అనిపిస్తే, కొంత సమయం పాటు మీ పని నుంచి విరామం తీసుకోండి.
Also Read: