AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sebastian pc 524: ఆహాలో సందడి చేయనున్న కిరణ్ అబ్బవరం.. సెబాస్టియన్ పీసీ 524 మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Sebastian pc 524: ఆహాలో సందడి చేయనున్న కిరణ్ అబ్బవరం.. సెబాస్టియన్ పీసీ 524 మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Kiran
Rajitha Chanti
|

Updated on: Mar 12, 2022 | 3:35 PM

Share

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఈ హీరో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా కిరణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం సెబాస్టియన్ పీసీ 524 (sebastian pc 524) . ఇందులో ఇందులో కిరణ్ సరసన కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించగా.. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. మార్చి 4న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఆర్థిక సమస్యలు, కష్టాలతో పెరిగి.. చివరు పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు.. అతనికున్న రేచీకటి సమస్య వలన మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కోని సస్పెండ్ కావడం.. తిరిగి ఆ కేసును ఎలా చేధించాడు అనేది సినిమా.

విడుదలై నెల రోజులు కాకముందే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో కిరణ్ అబ్బవరం సినిమా సందడి చేయనుంది. మార్చి 18 నుంచి ఆహాలో సెబాస్టియన్ పీసీ 524 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని సినిమా చేస్తున్నాడు.. ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై కోడి దివ్వ దీప్తి నిర్మిస్తుండగా.. కొత్త డైరెక్టర్ కార్తీ్క్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన కిరణ్ అబ్బవరం.. మాస్ క‌మ‌ర్షియ‌ల్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాడు.

ట్వీట్..

Also Read: Samantha And Varun Dhawan: సామ్‌కు ఎస్కార్టులా మారిపోయిన బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

Jacqueline Fernandez: చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న వయ్యారాలు వలకబోస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..

Anasuya Bharadwaj: బుల్లితెర అయిన వెండితెరకు అయిన తగ్గని అందాల ‘అనసూయ’ జోరు..(ఫొటోస్)

BellamKonda Suresh: చీటింగ్‌ కేసుపై స్పందించిన బెల్లంకొండ సురేష్‌.. ఇదంతా ఓ రాజకీయ నాయకుడి కుట్రేనంటూ..