Spider Man No Way Home: ఓటీటీలో సందడి చేయనున్న స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
సూపర్ హీరో చిత్రాలకు మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ సూపర్ మ్యాన్ సిరీస్ సినిమాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తి చూపుతారు. దీనిని మరోసారి నిరూపించింది స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ (Spider Man No Way Home).
సూపర్ హీరో చిత్రాలకు మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ సూపర్ మ్యాన్ సిరీస్ సినిమాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తి చూపుతారు. దీనిని మరోసారి నిరూపించింది స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ (Spider Man No Way Home). గతేడాది డిసెంబర్ 16న యూఎస్ కంటే ఒక రోజుమందే ఇండియాలో ఈ చిత్రం విడుదలైంది. మొదటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో వచ్చిన కథలు, అందులోని క్యారెక్టర్లను కనెక్ట్ చేస్తూ దర్శకుడు జాన్‌వాట్ ఈ విజువల్ వండర్‌ను సృష్టించాడు. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాలండ్ (Tom Holland) తన అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.
వెండితెరపై కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇండియాలో సుమారు రూ. 200 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సిల్వర్ స్క్రీన్ పై ఇంతలా సందడి చేసిన స్పైడర్ మ్యాన్ ఇప్పుడు డిజిటల్ మాధ్యమం వేదికగా సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఓటీటీలో అడుగుపెట్టనున్నాడు. మార్చి 23నుంచి బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆరోజున 4K అల్ట్రా హెచ్‌డీ స్ట్రీమింగ్‌లో కానున్న స్పైడర్ మ్యాన్ ఏప్రిల్ 12 నుంచి Blue-Ray క్వాలిటీలో కనిపించనున్నాడు. దీనికి సంబంధించి స్పైడర్ మ్యాన్ చిత్రబృందం సోషల్ మీడియాలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
It’s a swing and a hit, right on your screens at home ? Spidey is landing soon on BMS Stream. Pre-book now! . . .#spiderman #spidermannowayhome #tomholland #marvel #streaming #spidermanstream pic.twitter.com/b4Af8dYYZt
— BookMyShow Stream (@BmsStream) March 10, 2022
Also Read:Viral Video: ‘ఊ అంటావా టూరిస్ట్.. ఊఊ అంటావా టూరిస్ట్’.. పిల్ల ఏనుగు రచ్చ మామూలుగా లేదండోయ్..!
AP Inter exams 2022: ఏపీ ఇంటర్ 2022 సెకండియర్ ప్రాక్టికల్స్ వాయిదా! త్వరలో కొత్త తేదీలు..
Radhe Shyam: ‘రాధే శ్యామ్’ సినిమా ఎంజాయ్ చేయడానికి ఈ 6 కారణాలు చాలట..