Samantha: ఇది నాకు నచ్చిన లుక్ అంటున్న సమంత.. చైతు మరదలు ఆశ్రిత కామెంట్
Samantha: ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగేళ్లకు చైసామ్(Chaisam) లు తమ వివాహ బంధానికి విడాకులతో గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి సమంత ఓ వైపు వరస సినిమాలతో జోరు పెంచింది. మరోవైపు విహారయాత్రలు చేస్తూ..
Samantha: ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగేళ్లకు చైసామ్(Chaisam) లు తమ వివాహ బంధానికి విడాకులతో గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి సమంత ఓ వైపు వరస సినిమాలతో జోరు పెంచింది. మరోవైపు విహారయాత్రలు చేస్తూ.. రకరకాల యాక్టివిస్ తో సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డ్ కు సమంత ఎన్నికైంది. ఈ అవార్డును స్వీకరించేందుకు సమంత ముంబైలో ఉంది. అవార్డ్ ఫంక్షన్ కోసం ఎమరాల్డ్ గ్రీన్, నలుపు రంగు నైనికా డ్రెస్ ను ధరించి మరింత అందంగా కనిపిస్తూ.. తన అందంతో అందరినీ కట్టిపడేసింది.
ఇది కలలా కనిపిస్తుంది అంటూ సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఈ డ్రెస్ ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. నాకు అత్యంత ఇష్టమైన లుక్ లో ఇదొకటి అంటూ చెప్పింది. ఈ ఫోటోకి ఫ్యాన్స్ తో పాటు రష్మిక, హన్సిక హన్సిక వంటి హీరోయిన్లు కూడా స్పందించారు. అయితే అందరినీ ఆకట్టుకున్న ప్రశంసలు.. నాగ చైతన్య మేనమామ హీరో వెంకటేష్ కుమార్తె దగ్గుబాటి అశ్రిత చేసిన కామెంట్. ఫుడ్ బ్లాగర్ అయిన నాగ చైతన్య కజిన్ మరియు ఆశ్రిత దగ్గుబాటి ఇన్ఫినిటీ ప్లాటర్ పేరిట ఇన్ స్టాగ్రామ్ ఖాతాను రన్ చేస్తోంది. ఆ ఖాతా నుంచి ముచ్చటేస్తోందంటూ.. ఓ లవ్ సింబల్ ఉన్న ఓ ఎమోజీని పోస్ట్ చేసింది.
చాలా అందంగా ఉన్నావంటూ రష్మిక మందాన్న , ఎందుకో అలా అంటూ సంయుక్త హెగ్డే, ఫైర్ అంటూ రుహానీ శర్మ, హన్సికలు కామెంట్ చేశారు. ఇక సామ్ ఫ్యాన్స్ అయితే చాలా చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.
View this post on Instagram