Radhe Shyam Review: విజువల్‌ ఫీస్ట్ ‘రాధే శ్యామ్‌’.. డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..

బాహుబలిలాంటి జానపద సినిమా, సాహోలాంటి యాక్షన్‌ బేస్డ్ మూవీ చేసిన తర్వాత ప్రభాస్‌ సంతకం చేసిన రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ రాధేశ్యామ్‌.

Radhe Shyam Review: విజువల్‌ ఫీస్ట్ 'రాధే శ్యామ్‌'.. డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే..
Radhe Shyam
Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Basha Shek

Mar 11, 2022 | 1:55 PM

బాహుబలిలాంటి జానపద సినిమా, సాహోలాంటి యాక్షన్‌ బేస్డ్ మూవీ చేసిన తర్వాత ప్రభాస్‌ సంతకం చేసిన రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ రాధేశ్యామ్‌. ప్యాన్‌ ఇండియా ఇమేజ్‌ వచ్చిన తర్వాత ప్రభాస్‌ చేసిన సినిమా ఇది. పైగా ఇటలీలో షూటింగ్‌, ట్రెయిన్‌ ఎపిసోడ్‌, షిప్‌ ఎపిసోడ్‌ వంటివన్నీ సినిమా మీద హోప్స్ పెంచినవే. డార్లింగ్‌ ఫ్యాన్స్ ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. ఇంతకీ ఎలా ఉంది?

నిర్మాణ సంస్థ: గోపీ కృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్ సినిమా: రాధేశ్యామ్‌ నటీనటులు: ప్రభాస్‌, పూజా హెగ్డే, కృష్ణంరాజు, జగపతిబాబు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌, ప్రియదర్శి తదితరులు సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌ కెమెరా: మనోజ్‌ పరమహంస ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, యాక్షన్‌ కొరియోగ్రఫీ: నిక్‌ పావెల్‌ నృత్యాలు: వైభవి మర్చంట్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాధాకృష్ణకుమార్‌ నిర్మాతలు: వంశీ, ప్రమోద్‌, ప్రసీద విడుదల: 11.03.2022

విక్రమాదిత్య(ప్రభాస్‌) హస్తసాముద్రిక నిపుణుడు. అతని గురువు పరమహంస. ప్రపంచంలో అత్యుత్తమ వ్యక్తులు ఎంతో మంది చేతి రేఖలను పరిశీలించి ఉంటాడు. కానీ శిష్యుడు చేయి.. గురువు చూడకూడదన్న కారణంగా చూడడు. వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా వదిలి రోమ్‌లో సెటిల్‌ అవుతాడు విక్రమాదిత్య. అక్కడ అతనికి ప్రేరణ (పూజా హెగ్డే) పరిచయమవుతుంది. ప్రేరణ చక్రబర్తి తన పెదనాన్న హాస్పిటల్లో పనిచేస్తుంటుంది. ఆమె కూడా డాక్టరే. అనుకోకుండా ఒకసారి ట్రెయిన్‌లో ఆదిత్యను కలుస్తుంది. తన చేతిలో ప్రేమ రేఖ లేదనుకునే ఆదిత్య.. ప్రేరణతో ప్రేమలో పడతాడు. వాళ్లిద్దరి కలయికలో ఎవరో ఒకరికే బతికే అవకాశం ఉంటే… ఆ అవకాశాన్ని ఎవరు ఎవరిచ్చారు? ఎదుటివారి కోసం ఆ ఇంకొకరు ఏం చేశారు? ప్రేరణ డెస్టినీలో ఏముంది? విక్రమాదిత్య రోమియో లాగా చనిపోయాడా? నేను రోమియోను కాదు అనే మాటను నిలబెట్టుకున్నాడా? చూసేద్దాం… ప్రభాస్‌ పూర్తిస్థాయి లవర్‌ రోల్‌ చేసిన సినిమా ఇది. పామిస్ట్ గా బెస్ట్ యాటిట్యూడ్‌ చూపించారు ప్రభాస్‌. డాక్టర్‌ కేరక్టర్‌లో, నేచర్‌ని ఇష్టపడే అమ్మాయిగా పూజా హెగ్డే లుక్స్ ఫిదా చేస్తాయి. భాగ్యశ్రీ నృత్యం చేసే తీరు, జగపతిబాబు యాటిట్యూడ్‌, కృష్ణంరాజు పెద్దరికం.. ఏ ఫ్రేమ్‌కి ఆ ఫ్రేమ్‌ బావుంది. ముఖ్యంగా సినిమాను తీసిన లొకేషన్లు, కెమెరా యాంగిల్స్, సెలక్ట్ చేసుకున్న థీమ్‌, గ్రాఫిక్స్ హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో షిప్‌ సన్నివేశాల్లో విజువల్‌ ఎఫెక్స్ట్ ఆసమ్‌ అనిపించాయి. సినిమా కోసం వేసిన సెట్స్ కూడా ఎక్కడా కృత్రిమంగా లేవు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా ఆసక్తికరంగానే అనిపించింది. ఏ శాస్త్రం 100 శాతం నిజం కాదు.. 99 శాతమే నిజం… దాన్ని జయించిన ఒక్క శాతం మందే ప్రపంచాన్ని శాసించి, చరితార్థులుగా మిగులుతారనే కాన్సెప్ట్ ని కూడా అందంగా చెప్పారు. చేతుల్లో ఏం ఉన్నా, లేకపోయినా, దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే చేతల్లో చేయలేనిది ఏదీ ఉండదనే విషయాన్ని కూడా పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. రాధేశ్యామ్‌ కాస్ట్యూమ్స్ ని స్పెషల్‌గా మెన్షన్‌ చేయాలి. స్క్రీన్‌ మొత్తం కొత్తగా కనిపించడంలో కాస్ట్యూమ్స్ కూడా ఎలివేట్‌ అయ్యాయి. 1970ల్లో ఉన్న రోడ్స్, అప్పుడు వాడిన వాహనాలను చూపించిన తీరు, రెండు బస్సుల్లో ఉన్న హీరో, హీరోయిన్లు మాట్లాడుకునే సన్నివేశాలు మెప్పిస్తాయి.

కాకపోతే ఇంత పెద్ద కేన్వాస్‌ని ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నప్పుడు ఇంకాస్త బలమైన సన్నివేశాలను రాసుకోవాల్సింది. ఇద్దరి మనసుల ప్రేమను మ్యాజికల్‌గా చూపించాలనుకున్నారు డైరక్టర్‌. ఆ విషయంలో కృతకృత్యుడయ్యారు. కాకపోతే ప్రభాస్‌లాంటి హీరోతో మాస్‌ ఎలివేషన్‌ ఉన్న ఫైట్స్, డైలాగ్స్ ఎక్స్ పెక్ట్ చేసి వచ్చేవారికి మాత్రం కాస్త నిరాశ కలిగించారు. ప్రియదర్శి కామెడీ, జయరామన్‌ హాస్పిటల్‌ సన్నివేశాలు పెద్దగా మెప్పించవు. కథలో నెక్స్ట్ ఎక్కడో ఉపయోగపడటానికి, ఇక్కడ వాళ్ల కేరక్టర్లను బలవంతంగా ఇరికించినట్టు అనిపించింది. హీరో, హీరోయిన్ల మధ్య కూడా బలమైన సంభాషణలకు అవకాశం ఉంది. ఆ విషయంలోనూ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కొన్ని చోట్ల సన్నివేశాల ఎలివేషన్‌కి అద్భుతంగా తోడ్పడింది తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌. పాటలు, వాటి పిక్చరైజేషన్‌ ఇంకో రేంజ్‌లో అనిపించింది.

కాకపోతే ప్రతి ఫ్రేమూ స్లోగా కదలడం యూత్‌కి అంతగా రుచించకపోవచ్చు. ప్రతి విషయాన్నీ పర్టిక్యులర్‌గా చూస్తే లోపాలు కనిపిస్తాయి కానీ, ఓవరాల్‌గా సినిమా… తెలుగు ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

– డా. చల్లా భాగ్యలక్ష్మి

Also Read:Punjab Assembly Elections: దుమ్ము దులిపిన చీపురుకట్ట.. రాజకీయ పండితులకూ తప్పని ఓటమి

Chanakya Niti: కొన్ని విషయాలు క్షణికానందాన్ని ఇస్తాయి.. వాటిని చూసి పొంగిపోకూడదు అంటున్న

చాణక్య

Akhilesh Yadav: అయినా మేం ఓడిపోలేదు.. యూపీ ఎన్నికల ఫలితాలపై అఖిలేశ్ కీలక వ్యాఖ్యలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu