Akhilesh Yadav: అయినా మేం ఓడిపోలేదు.. యూపీ ఎన్నికల ఫలితాలపై అఖిలేశ్ కీలక వ్యాఖ్యలు

Akhilesh Yadav: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి గతంలో కంటే సీట్ల సంఖ్య బాగా పెరిగిందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) అన్నారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. బీజేపీ(BJP)పై...

Akhilesh Yadav: అయినా మేం ఓడిపోలేదు.. యూపీ ఎన్నికల ఫలితాలపై అఖిలేశ్ కీలక వ్యాఖ్యలు
Akhilesh Yadav
Follow us
Ganesh Mudavath

| Edited By: Anil kumar poka

Updated on: Mar 11, 2022 | 1:26 PM

Akhilesh Yadav: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి గతంలో కంటే సీట్ల సంఖ్య బాగా పెరిగిందని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) అన్నారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. బీజేపీ(BJP)పై విమర్శలు గుప్పించారు. 2017 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గాయని గుర్తు చేశారు.  రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభావం మరింత తగ్గుతుందన్నారు. “యూపీ ఎన్నికల్లో సీట్లను రెండున్నర రెట్లు, ఓట్ల శాతాన్ని 1.5 రెట్లు పెంచినందుకు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. బీజేపీ సీట్లు తగ్గుతున్నాయని మేం నిరూపించాం. ఆ పార్టీకి ఉన్న భ్రమలు సగానికి పైగా తొలగిపోయాయి. ముందు ముందు పూర్తిగా పోతాయని అఖిలేశ్ అన్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గతంలో పోలిస్తే కాషాయ పార్టీ సీట్ల సంఖ్య కాస్త తగ్గింది. గత ఎన్నికల్లో 300లకు పైగా సీట్లు సాధించిన బీజేపీ తాజా ఎన్నికల్లో 254 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తంగా బీజేపీ కూటమి 273 స్థానాల్లో గెలిచింది. ఇక సమాజ్‌వాదీ కూటమి 125 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ ఒక్కటే 111 స్థానాల్లో గెలుపొందింది.

మరోవైపు ఈసారి యూపీలో బీజేపీ, ఎస్పీ పార్టీల మధ్య మధ్య హోరాహోరీ ఉంటుందని విశ్లేషకులు భావించారు. తాజా ఎన్నికల్లో గెలిచి సీఎం పదవిని మరోసారి అధిష్ఠించాలన్న లక్ష్యంతో ముందు నుంచే ప్రణాళికలు రచించారు. సామాజిక సమీకరణాలను విశ్లేషించుకొని రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ), సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) తదితర చిన్న పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేశారు. అయితే- ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ‘మహరాజ్‌ జీ’గా పేరొందిన సీఎం యోగి వంటి అతిరథ మహారథుల వ్యూహచతురత ముందు ఆయన ఎత్తులు పారలేదు. గత ఎన్నికల్లో 47 స్థానాలే సాధించిన ఎస్పీ.. ఈ సారి 111 సీట్లు కైవసం చేసుకుంది. మరోవైపు- ఐదేళ్ల కిందటి కంటే మరింత దారుణంగా కాంగ్రెస్‌ 2, మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఒకే ఒక్క సీటుకు పరిమితమవడం గమనార్హం.

Also Read:

Angiogram: అసలు యాంజియోగ్రామ్ అంటే ఏమిటి.. ఏ సమయాల్లో చేస్తారు..? ఎందుకు చేస్తారు..?

Longest Living Creatures: తెలుసా! ఈ జంతువులు లక్షల ఏళ్లగా భూమిపై ఇంకా బతికే ఉన్నాయట..

AP Crime: యువకుడిని చెట్టుకు కట్టేసి.. యువతిని లాక్కెళ్లి.. మద్యం మత్తులో ఏం చేశారంటే