Kamal Haasan: పదేళ్లలో దుమ్ము దులిపేశారు.. కేజ్రీవాల్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన కమల్ హాసన్

Kamal Haasan: ఇప్పటి వరకూ దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో తమ పాలన కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi party) తాజాగా మరో రాష్ట్రానికి తన పాలన విస్తరించుకుంది. తాజాగా పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం..

Kamal Haasan: పదేళ్లలో దుమ్ము దులిపేశారు.. కేజ్రీవాల్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన  కమల్ హాసన్
Kamal Haasan Tweet On Aaps
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2022 | 4:31 PM

Kamal Haasan: ఇప్పటి వరకూ దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో తమ పాలన కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi party) తాజాగా మరో రాష్ట్రానికి తన పాలన విస్తరించుకుంది. తాజాగా పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది రవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ. దీంతో ఆప్ పార్టీ జాతీయ హోదాను సాధించేకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఆప్ పంజాబ్ లో ఘన విజయం సొంతం చేసుకోవడంతో.. అరవింద్ కేజ్రీవాల్ కు ప్రముఖుల నుంచి విషెష్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా స్టార్ హీరో, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్ లో ఆప్ విజయంపై శుభాకాంక్షలు చెప్పారు.

పంజాబ్ లో ఆప్ పార్టీ అఖండ విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు… పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలోనే మరో రాష్ట్రమైన పంజాబ్‌లో విజయం సాధించడం అభినందనీయం.. అంటూ కమల్ హాసన్ తన ట్విట్టర్ వేదికగా విషేష్ చెప్పారు.

ఏదైనా ప్రాంతీయ పార్టీకి జాతీయహోదా దక్కాలంటే.. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం ఓట్లలో కనీసం 6% ఓట్లను రాజకీయ పార్టీ సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు ఏదైనా రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ హోదానిస్తుంది ఎన్నికల సంఘం. మనదేశంలో జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందినవి  కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు.

అయితే ప్రస్తుతం ఆప్ పార్టీ జాతీయ పార్టీగా మరేదిశగా అడుగులు వేస్తోంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 54% ఓట్లను సాధించగా..  2022 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో 42%, గోవాలో 6.77%, ఉత్తరాఖండ్‌లో 3.4%, ఉత్తరప్రదేశ్‌లో 0.3% ఓట్ల వాటాను నమోదు చేసింది.

Also Read: Human Milk Bank: ఒడిశాలో తల్లిపాలను భద్రపరచే మానవ పాల బ్యాంక్ ప్రారంభం.. మొదటి రోజునే మంచి స్పందన

IND Vs SL, 2nd Test: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. బెంగళూరు డే/నైట్ మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో అభిమానులకు అనుమతి

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు