CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు
KCR Hospitalised: ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి, కుమార్తె, మనుమడు, ఎంపీ సంతోష్ ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యాంజియోగ్రామ్ రిపోర్ట్ నార్మల్‌గా వచ్చింది. రక్తనాళాల్లో ఎలాంటి బ్లాక్స్ లేవు. అలాగే గుండె సంబంధిత ఇబ్బందులు కూడా ఏమీ లేవని తేలింది. ముందుజాగ్రత్తగా CT స్కాన్‌తోపాటు.. మరికొన్ని ఇతర పరీక్షలు నిర్వహించారు. CM కేసీఆర్ 2 రోజులుగా కాస్త నీరసంగా ఉన్నారని ఆయన్ను రెగ్యులర్‌గా పరీక్షించే ఫ్యామిలీ వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. ఎడమచేయి కూడా కొంచెం లాగుతున్నట్లు చెప్పడంతో… జనరల్ చెకప్‌లో భాగంగా ప్రాథమిక టెస్టులు చేశారు. అనంతరం యాంజియోగ్రామ్ కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు CM కేసీఆర్. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆస్పత్రికి వచ్చిన టైమ్‌లోనూ కేసీఆర్ నార్మల్‌గానే ఉన్నారు. ఆయనే స్వయంగా నడుస్తూ టెస్టుల కోసం వెళ్లారు..
Published on: Mar 11, 2022 12:29 PM
వైరల్ వీడియోలు
Latest Videos