Human Milk Bank: ఒడిశాలో తల్లిపాలను భద్రపరచే మానవ పాల బ్యాంక్ ప్రారంభం.. మొదటి రోజునే మంచి స్పందన
Human Milk Bank: ఒడిశా(Odisha)లోని మొట్టమొదటి మానవ పాల బ్యాంకును క్యాపిటల్ హాస్పిటల్(Capital Hospital) లో ప్రారంభించారు. తల్లులు పాలు పట్టలేని నవజాత శిశువులకు, తల్లులు మరణించిన శిశువులకు, అనారోగ్యంతో ఉన్న..
Human Milk Bank: అమ్మపాలు అమృతంతో సమానం… అయితే మారుతున్న కాలంతో పాటు అమ్మతనంలో కూడా మార్పులు వచ్చాయి. ఇపుడు పుట్టిన శిశువుకి తల్లిపాలను అందించే అవకాశం కూడా తగ్గుతుంది. దీంతో దేశంలో తల్లిపాలను నిల్వ చేసే పాల బ్యాంక్ లు వెలుస్తున్నాయి. తాజాగా ఒడిశా(Odisha)లోని మొట్టమొదటి మానవ పాల బ్యాంకును క్యాపిటల్ హాస్పిటల్(Capital Hospital) లో ప్రారంభించారు. తల్లులు పాలు పట్టలేని నవజాత శిశువులకు, తల్లులు మరణించిన శిశువులకు, అనారోగ్యంతో ఉన్న లేదా తగినంత పాలు అందని శిశువులకు.. లేదా తల్లి పాలను తీసుకోలేని శిశువులకు ఈ బ్యాంక్ తల్లి పాలను అందిస్తుంది. ఇదే విషయంపై క్యాపిటల్ హాస్పిటల్ డైరెక్టర్ ఎల్‌డి సాహూ స్పందిస్తూ.. “పాశ్చరైజేషన్ తర్వాత ఆరు నెలల వరకు పాలను బ్యాంకులో నిల్వ చేయవచ్చని చెప్పారు. ప్రారంభంలో నిల్వ చేసిన పాలను ఇంట్లో ఉన్న శిశువులకు అందించబడుతుందని తెలిపారు. ఈ పాల కేంద్రాన్ని వచ్చే స్పందనను బట్టి.. త్వరలోనే ఈ సేవలను మరింతగా విస్తరించే ఆలోచన చేస్తామని తెలిపారు. అత్యాధునిక మిల్క్ బ్యాంక్.. తల్లుల పాలలోని పోషక విలువలను సంరక్షిస్తుందని చెప్పారు. త్వరలోనే ఇతర కేంద్రాలలో కూడా ఇటువంటి సౌకర్యాలను ప్రారంభిస్తామని అన్నారు. ఈ అత్యాధునిక మిల్క్ బ్యాంక్ తల్లుల పాలలోని పోషక విలువలను నిలుపుదల చేస్తుందన్నారు. ఈ మిల్క్ బ్యాంక్ ను ప్రారంభించిన మొదటి రోజున, 19 మంది పాలిచ్చే తల్లులు తమ పాలను బ్యాంకుకు విరాళంగా అందించారు. ఆ తర్వాత వారి పిల్లలకు పాలను తాగించారు.
“పాశ్చరైజేషన్ కోసం, మాకు కనీసం 2.5 లీటర్ల పాలు అవసరం. మిల్క్ బ్యాంక్ ఇంకా వాణిజ్య వినియోగానికి రాలేదని చెప్పారు. ప్రస్తుతం తల్లులు మాత్రమే తమ పిల్లలకు పాలు నిల్వ చేస్తున్నారు. మిగిలిన తల్లులు తమ పాలు విరాళం ఇచ్చేలా అవగాహన కల్పించడంతోపాటు … నవజాత శిశువుల కుటుంబాలకు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేలా కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్ ధనంజయ్ దాస్ అన్నారు. దాతల ఆరోగ్య డేటా ఆస్పత్రిలో భద్రపరుస్తామని.. నిల్వ ఉంచిన పాలను సక్రమంగా వినియోగించేలా చూస్తామని తెలిపారు. దేశంలో మొట్టమొదటి మానవ పాల బ్యాంకు 1989లో ముంబైలోని సియోన్ హాస్పిటల్‌లో స్థాపించబడింది.
Also Read: