Nandamuri Balakrishna: ఎవరైనా జీవితంలో బాగుపడాలంటే.. కోపం తగ్గించుకోమని.. ఐదు సింపుల్ టిప్స్ చెప్పిన బాలయ్య

Nandamuri Balakrishna: అన్న నందమూరి తారకరామారావు(NTR) నట వారసుడిగా వెండి తెరపై తాతమ్మకల(Tatammakala) సినిమాతో నందమూరి బాలకృష్ణ బాలనటుడిగా అడుగు పెట్టి.. సాహసమే జీవితం..

Nandamuri Balakrishna: ఎవరైనా జీవితంలో బాగుపడాలంటే.. కోపం తగ్గించుకోమని.. ఐదు సింపుల్ టిప్స్ చెప్పిన బాలయ్య
Nanadamuri Balakrishna
Follow us

|

Updated on: Mar 11, 2022 | 11:25 AM

Nandamuri Balakrishna: అన్న నందమూరి తారకరామారావు(NTR) నట వారసుడిగా వెండి తెరపై తాతమ్మకల (Tatammakala) సినిమాతో నందమూరి బాలకృష్ణ  బాలనటుడిగా అడుగు పెట్టి.. సాహసమే జీవితం(Sahasame jeevitam) సినిమాతో హీరోగా మారారు. విభిన్న కథా చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. మంచి మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.  ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నారు. అయితే నిజ జీవితంలో బాలయ్య కు కోపిష్టి అనే టాక్ ఉంది. అయితే తమ  హీరోకి ఉన్నది కోపం కాదు.. ఆత్మాభిమానం అని అంటారు అయన ఫ్యాన్స్.  అంతేకాదు.. బాలయ్యది చిన్న పిల్లల నేచర్, కల్మషం లేని మనసత్త్వం అని సన్నిహితులు చెబుతారు. ఏది మనసులో పెట్టుకోరని.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని చెబుతారు.

అయితే బాలయ్య కోపాన్ని ఎంతమంది ఎన్ని విమర్శించినా నా దారి రహదారి.. అంటూ ఎవరిని పట్టించుకోకుండా తన పంథాను తాను నడుస్తారు. ఇప్పటికే బుల్లి తెరపై హీరోగా అలరించిన బాలయ్యబాబు.. తాజాగా ఆహా కోసం యాంకర్ గా మారారు. తనదైన శైలి తనతోటి నటీనటులను ఇంటర్వ్యూ చేస్తూ.. బుల్లి తెరపై కూడా సక్సెస్ అయ్యారు. అయితే తాజాగా బాలయ్య బాబు కోపం తగ్గించుకోవడానికి 5 టిప్స్ చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

కోపం తగ్గించుకోవడానికి బాలయ్య చెప్పిన టిప్స్ : 

1) ఎవరైనా సరే మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి. కోపంలో మీలో తేడా సింగ్ ను తీసుకొని రావద్దని చెప్పారు. 2) ఏదైనా చేసే ముందు.. ఎలా చేస్తామో.. కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్క పెట్టుకోవాలి.. ఒన్, టూ, త్రీ . అంటూ ఇలా నెంబర్స్ లెక్కపెట్టుకుంటే.. కోపం అదుపులోకి వస్తుందన్నారు. 3)కోపం వచ్చిన ప్పుడు అసలు ప్రాబ్లెమ్ ఏమిటో తెలుసుకోవాలని.. అరుపులు కేకలు పెట్టకుండా అసలు ప్రాబ్లం ఏంటో ఆలోచించాలని చెప్పారు. 4)క్షమించేస్తే.. సమరసింహా రెడ్డికంటే గొప్పవారు కావచ్చు.. మనసులో ఏమి పెట్టుకోకుండా ఏది ఉంటే అది బయటపెట్టి క్షమించేయాలి. 5) ఇది అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది. తన కోపమే తన శత్రువు… తన శాంతమే తనకు రక్ష అని అన్నారు.  మీకోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ..  కోపం ఎక్కువ వస్తే మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించి అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడని చెప్పారు. ఈ టిప్స్ ఫాలోయితే బాగుపడటాని చెప్పారు.

అఖండ సూపర్ హిట్ అందుకున్న బాలయ్య..  ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

Also Read:

AP Budget 2022: ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు.. ఏయే శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే?

IND Vs SL, 2nd Test: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. బెంగళూరు డే/నైట్ మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో అభిమానులకు అనుమతి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే