AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Budget 2022: ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు.. ఏయే శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే?

AP Budget 2022-23: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి...

AP Budget 2022: ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు.. ఏయే శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే?
Ap Budget Buggana
Balaraju Goud
|

Updated on: Mar 11, 2022 | 11:23 AM

Share

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022 -23 ఏపీ వార్షిక బడ్జెట్ ను రూ. 2,56,256 కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీ ముందుంచారు. ఇక ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు అని, మూలధనం వ్యయం రూ.47,996 కోట్లు అని స్పష్టం చేశారు.ఇక రెవెన్యూ లోటు రూ. 17,036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లుగా పేర్కొంటూ మంత్రి అసెంబ్లీ లో ప్రకటన చేశారు.

2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ ప్రధానాంశాలు

  1. 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు
  2. రెవెన్యూ వ్యయం రూ. 2,08,261 కోట్లు
  3. మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు
  4. రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లు
  5. ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు

శాఖల వారీగా కేటాయింపులు

  1. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
  2. వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
  3. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
  4. వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
  5. అటవీ శాఖ రూ.685 కోట్లు
  6. రోడ్లు భవనాల శాఖకు రూ.8581 కోట్లు.
  7. వైద్యశాఖకు 15,384 కోట్లు.
  8. హోంశాఖకు రూ.7586 కోట్లు.
  9. కార్మిక శాఖకు రూ.790 కోట్లు.
  10. మున్సిపల్ శాఖకు రూ.8796 కోట్లు.
  11. మైనార్టీ శాఖకు 2063 కోట్లు.
  12. పంచాయతీరాజ్ శాఖకు 15,826 కోట్లు.
  13. హౌసింగ్ కు రూ.4791 కోట్లు.
  14. ఇరిగేషన్ 11,482 కోట్లు
  15. మౌళిక వసతులు 1142 కోట్లు.
  16. పౌరసరఫరాలకు 3719 కోట్లు.
  17. పరిశ్రమలు వాణిజ్యం 2795 కోట్లు.
  18. ఐటీశాఖకు రూ.211 కోట్లు.
  19. న్యాయశాఖకు 924 కోట్లు
  20. రెవెన్యూ శాఖకు 5306 కోట్లు
  21. వృత్తి నైపుణ్యం 969 కోట్లు
  22. వ్యవసాయకు 11,387 కోట్లు
  23. పశుసంవర్ధన శాఖకు 1568 కోట్లు
  24. ఉన్నత విద్యకు 2014 కోట్లు
  25. సాంఘిక సంక్షేమ శాఖకు 12,768 కోట్లు
  26. సెకండరీ ఎడ్యుకేషన్ 27,706 కోట్లు.
  27. విద్యుత్ 10,281 కోట్లు
  28. క్రీడాశాఖకు రూ.290 కోట్లు.