AP Budget 2022: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ప్రభుత్వం 2 లక్షల 56 వేల 256 కోట్ల తో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది.
AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 సంవత్సరపు బడ్జెట్ అంచనాలు దిగువన చూడండి…
- 2లక్షల 56 వేల 257 కోట్లతో బడ్జెట్
- రెవిన్యూ వ్యయం 2 లక్షల 8 వేల 261 కోట్లు
- మూల ధన వ్యయం 47,996 కోట్లు.
- రెవెన్యూ లోటు 17,036 కోట్లు.
- ద్రవ్య లోటు 48,724 కోట్లు.
- జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతం
- జీఎస్డీపీ ద్రవ్య లోటు 3.64 శాతం
అంతకముందు సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. వ్యవసాయ బడ్జెట్, గవర్నర్ ప్రసంగానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో సామాజిక ఆర్థిక సర్వే 2021-22 సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. 18.47 శాతం వృద్ధి రేటుతో.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక గ్రోత్ రేటు నమోదైనట్లు గవర్నమెంట్ తెలిపింది.