నా భర్తను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు.. అత్తింటి ఎదుట యువతి నిరసన
చదువుకునే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెళ్లికి దారి తీసింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నారు. తర్వాత అత్తింటికి వెళ్లాక.. వారి అసలు రూపం బయటపడింది....
చదువుకునే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెళ్లికి దారి తీసింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నారు. తర్వాత అత్తింటికి వెళ్లాక.. వారి అసలు రూపం బయటపడింది. పెళ్లైన రెండో రోజు నుంచే వేధించడం ప్రారంభించారు. అంతే కాకుండా జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన భర్త.. వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో యువతి.. అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. తెలంగాణలోని నల్గొండ(Nalgonda) జిల్లాకు చెందిన మహమ్మద్ సనా అనే యువతి.. 2019 లో ఈసెట్ శిక్షణ తీసుకుంది. ఆసమయంలో రమేష్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జనవరి 4న మదనపల్లె(Madanapalle) మండలంలోని ఓ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం అత్తింటికి వెళ్లారు. అయితే మొదటి రోజు బాగానే చూసుకున్న వారు.. పెళ్లైన రెండో రోజు నుంచే ఇబ్బందులకు గురి చేసేవారని సనా తెలిపారు. ఆహారం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారని చెప్పారు. వారి వేధింపులు తాళలేక.. దంపతులిద్దరూ మదనపల్లె ఎస్టేట్‌లో ఓ ఇంట్లోకి అద్దెకు వెళ్లారు.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం రమేష్ కుమార్ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అత్తింటివారిని అడిగితే తమకు తెలియదన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతాంతర వివాహం చేసుకోవడంతో అత్తింటి వారు తనను గృహహింస పెట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. రమేష్ కుమార్‌ను వదిలేయాలని అతని కుటుంబ సభ్యులు, కొందరు వైకాపా నాయకులు తనను బెదిరించడంతో పాటు కొట్టారని, తాను వెళ్లనని పట్టుబట్టడంతో ఇలా చేశారని అత్తింటి ఎదుట ఆందోళనకు దిగారు. తన భర్త ఆచూకీ తెలిపి, న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు సనా అత్తింటివారు.. సనా కుటుంబసభ్యులే రమేష్ కుమార్‌ను ఏదైనా చేసుంటారని ఆరోపించారు. ఇదే విషయంపై ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో మదనపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
Viral Video: బరాత్ లో వధువు డ్యాన్స్.. భావోద్వేగంతో వరుడి రియాక్షన్ ఏంటంటే..
Viral Photo: ఫోటోలోని ప్రముఖ వ్యాపారవేత్తను గుర్తుపట్టారా..? మీ మెదడుకు మేత..