AP Crime: యువకుడిని చెట్టుకు కట్టేసి.. యువతిని లాక్కెళ్లి.. మద్యం మత్తులో ఏం చేశారంటే

దేశంలో మహిళలు, యువతుల మీద Sexual assaultsపెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల మీద దాడులను ఎదుర్కొనేందుకు ఎన్ని చట్టాలను అమలు చేస్తున్నా కొందరు మానవ మృగాలు మాత్రం మారడం లేదు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ...

AP Crime: యువకుడిని చెట్టుకు కట్టేసి.. యువతిని లాక్కెళ్లి.. మద్యం మత్తులో ఏం చేశారంటే
rape case
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 11, 2022 | 11:44 AM

దేశంలో మహిళలు, యువతుల మీద Sexual assaultsపెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల మీద దాడులను ఎదుర్కొనేందుకు ఎన్ని చట్టాలను అమలు చేస్తున్నా కొందరు మానవ మృగాలు మాత్రం మారడం లేదు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ దేశంలో ప్రతీ రోజు ఏదో ఒక చోట మహిళల మీద లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోలో మరో అమానవీయ ఘటన జరిగింది. యువతిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారం(Gang Rape) చేశారు. ఆమె తన ప్రేమికుడితో ఉండగానే దుండగులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. అతణ్ని తాడుతో కట్టేసి అతని ముందే ఈ అఘాయిత్యం చేశారు. మచిలీపట్నం (Machilipatnam) లోని ఫిషింగ్ హార్బర్ చూసేందుకు సముద్ర తీరానికి వెళ్లిన ప్రేమ జంటపై ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, బందర్‌ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడికి పాల్పడ్డవారిలో నాగబాబు అనే వ్యక్తి కూడా ఉన్నారని పోలీసులు గుర్తించి, అతనిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు ఓ కళాశాల విద్యార్థినిగా గుర్తించారు.

బాధిత యువతి తన ప్రియుడితో కలిసి బీచ్‌కి వెళ్లింది. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా, వారి వద్దకు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ఫూటుగా మద్యం తాగిన వారు.. యువకుడిని తాళ్లతో చెట్టుకు కట్టేశారు. విద్యార్థినిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఎవరికీ చెప్పుకోలేక ప్రేమ జంట సైలెంట్ గా ఉండిపోయింది. అయితే, ఈ ఘటనపై తీవ్రంగా బాధ పడిపోతున్న విద్యార్థినిని ఆమె సోదరుడు గమనించి గట్టిగా అడిగాడు. దీంతో విద్యార్థిని ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బందరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాగబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు బందరు ఎస్సై వాసు తెలిపారు.

Also Read

Nandamuri Balakrishna: ఎవరైనా జీవితంలో బాగుపడాలంటే.. కోపం తగ్గించుకోమని.. ఐదు సింపుల్ టిప్స్ చెప్పిన బాలయ్య

TS Assembly Budget Session Live: నాలుగో రోజుకు చేరుకున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. (లైవ్ వీడియో)

Rashmika Mandanna: సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించిన శ్రీవల్లి.. ఆ విషయం గురించి మాత్రం చెప్పనంటూ..