AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SL, 2nd Test: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. బెంగళూరు డే/నైట్ మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో అభిమానులకు అనుమతి

IND Vs SL, 2nd Test: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పింది కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(KSCA). రేపటి నుంచి భారత(India), శ్రీలంక(Srilanka) రెండవ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరుదేశాల మధ్య రెండు టెస్టుల..

IND Vs SL, 2nd Test: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. బెంగళూరు డే/నైట్ మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో అభిమానులకు అనుమతి
Ind Vs Sl, 2nd Test
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2022 | 10:46 AM

IND Vs SL, 2nd Test: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పింది  కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(KSCA). రేపటి నుంచి  భారత(India), శ్రీలంక(Srilanka) రెండవ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరుదేశాల మధ్య రెండు టెస్టుల సీరీస్ లో భాగంగా శనివారం సాయంత్రం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ డే/నైట్ టెస్టుకు మ్యాచ్ కు 100 శాతం ప్రేక్షకులకు అనుమతినిచ్చింది కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన తరువాత KSCA ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ కు టికెట్లకు డిమాండ్ పెరగడంతో అసోసియేషన్.. ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలిసింది. ఇప్పటికే క్రికెట్ ప్రేమికుల కోసం పెట్టిన 10,000 టిక్కెట్లు మొదటి రెండు రోజుల్లో అమ్ముడయ్యాయని KSCA కోశాధికారి వినయ్ మృత్యుంజయ చెప్పారు. అయితే ఇప్పటికే కోహ్లీ వందో టెస్టు ఆడిన మొహాలీ స్టేడియంలో కరోనా నిబంధనల నేపథ్యంలో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించారు. అయితే పింక్ బాల్ తో జరుగుతున్నా బెంగళూరు డే/నైట్ టెస్టుకు మాత్రం 100 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించినట్టు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) పేర్కొంది.

మొత్తం స్టేడియంను ప్రేక్షకులకు తెరిచేందుకు KSCA నిర్ణయం తీసుకున్న తర్వాత, టికెట్స్ కు డిమాండ్ పెరుగుదలను తట్టుకోవడానికి శుక్రవారం నుండి అదనపు టిక్కెట్‌ల అమ్మకాన్ని మొదలు పెట్టింది. ఇప్పటికే కొన్ని టికెట్లను అమ్మగా.. 50 శాతం టికెట్లు నేటి నుంచి స్టేడియం వద్ద కేఎస్‌సీపీ అందుబాటులో పెట్టింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు బాక్సాఫీసు వద్ద టికెట్లు కొనుగోలు చేసుకునే వీలుని కల్పించింది.

రేపు ప్రారంభమయ్యే ఈ  రెండో టెస్టులో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంకపై క్లీన్ స్వీప్ చేయాలనీ ప్రతి క్రీడాభిమాని కోరుకుంటున్నాడు. స్వదేశంలో జరుగుతున్నా  పింక్-బాల్ టెస్టులో భారత్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది.  ఇప్పటికే రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ సేన ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో ముందంజలో ఉంది. మొహాలీలో  జరిగిన టెస్టులో ఆతిథ్య జట్టు శ్రీలంకను ఓడించింది.

ఇక కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో బెంగళూరును కోహ్లీని  రెండో హోం పిచ్‌గా పరిగణిస్తాడు. కోహ్లీ అభిమానులు ఇక్కడైనా టెస్టులో శతకం నమోదు చేయాలనీ కోరుకుంటున్నారు.    కోహ్లీ చివరిసారి నవంబరు 2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌ తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో సెంచరీ చేశాడు.

Also Read:

 సాధారణ ఆటగాడి నుంచి ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా మార్పు.. తగ్గేదేలే అంటోన్న టీమిండియా ఆల్‌ రౌండర్..