Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ఆర్ఆర్ఆర్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. భారీ ధరకు డిజిటల్ హక్కులు..

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం యావత్‌ దేశం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ (RamCharan, NTR)లు హీరోలుగా, రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా...

RRR: ఆర్ఆర్ఆర్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. భారీ ధరకు డిజిటల్ హక్కులు..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 10, 2022 | 6:19 PM

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం యావత్‌ దేశం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ (RamCharan, NTR)లు హీరోలుగా, రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా (Corona) కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల సినిమాలు థియేటర్లలో వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి రావడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడనే దానిపై కూడా చర్చ ప్రారంభమైంది. అయితే తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా థియేటర్లలో వచ్చిన కనీసం 90 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్ట్రీమింగ్‌ హక్కులతో పాటు హిందీకి సంబంధించి శాటిలైట్‌ హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇందుకుగాను జీ గ్రూప్‌ ఏకంగా రూ. 300 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. జూన్‌ రెండవ వారంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందని టాక్‌. ఇదిలా ఉంటే ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, స్పానిష్‌ భాషలకు గాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ హిందీ శాటిలైట్‌ హక్కులను జీ నెట్‌వర్క్‌ దక్కించుకోగా.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌ల హక్కులను స్టార్‌ ఇండియా దక్కించుకుంది. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Uttarakhand Election Result: ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్లాన్ వర్కౌట్.. మళ్లీ అధికారంలోకి..

అబ్బో అవికా అందాలు అదరహో.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ..

Snakes Village: పాముల గ్రామం గురించి ఎప్పుడైనా విన్నారా.. నమ్మలేని షాకింగ్ విషయాలు ఈ వీడియోలో..