Breaking! CSIR UGC-NET June 2021 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
సీఎస్ఐఆర్ - యూజీసీ నెట్ జూన్ 2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బుధవారం (మార్చి 10) విడుదల చేసింది..
CSIR-UGC NET June 2021 result declared: సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్ జూన్ 2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బుధవారం (మార్చి 10) విడుదల చేసింది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. CSIR NET 2021 పరీక్ష ఈ ఏడాది జనవరి 29, ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో జరిగాయి. దేశవ్యాప్తంగా 172 నగరాల్లోని 339 కేంద్రాలలో ఐదు సబ్జెక్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానం ద్వారా ఆరు ప్రత్యేక షిఫ్టుల్లో జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ఫిబ్రవరిలో విడుదలైంది. ఫిబ్రవరి 22 నుంచి 25 మధ్య వరకు అభ్యంతరాలను (objections) సమర్పించడానికి గడువునిచ్చింది. మొత్తం 159,824 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,18,861 మంది జేఆర్‌ఎఫ్‌కు, 40,963 మంది లెక్చర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా ఈసారి పరీక్షకు 2,07,306 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎన్టీఏ సర్టిఫికేట్లు జారీ చేస్తుంది.
CSIR UGC-NET 2021 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజ్‌లో కనిపించే ‘Joint CSIR-UGC NET June 2021 score card’ అనే లింక్‌పై క్లిక్ చేయ్యాలి.
- అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- సేవ్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకోవాలి.
Also Read: