AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Govt Job Notifications 2022: ఈ సారి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు.. టీఎస్పీఎస్సీ ద్వారా ఏయే పోస్టులంటే..

80,039 ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరు నియామక సంస్థల ద్వారా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటితోపాటు పలు కీలక అంశాలపై..

TS Govt Job Notifications 2022: ఈ సారి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు.. టీఎస్పీఎస్సీ ద్వారా ఏయే పోస్టులంటే..
Ts Govt Jobs
Srilakshmi C
|

Updated on: Mar 11, 2022 | 11:02 AM

Share

TS to recruitment 80,039 govt jobs soon: తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో చేపట్టనున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు వీలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 80,039 ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరు నియామక సంస్థల ద్వారా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటితోపాటు పలు కీలక అంశాలపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీఎస్పీఎస్సీ (TSPSC Officials) అధికారులతో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణరావు గురువారం (మార్చి 10)న భేటీ అయ్యారు. గతంలో వివిధ నియామకాలకు సంబంధించి పలు కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, దాదాపు 23,000ల పోస్టులు ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నాయని, ఈ సారి ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో చర్చించారు. వీటిల్లో ప్రధానంగా వీలైనంత తక్కువ సంఖ్యలో పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు (TS job notifications) ఇవ్వాలనే ప్రతిపాదన ప్రధానమైనది.

అంతేకాకుండా నోటిఫికేషన్‌ జారీ ముందు న్యాయపరమైన సలహాలు తీసుకోవాలనే అంశంపై కూడా చర్చలు సాగాయి. మొత్తం పోస్టులకు ఒకేసారి ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఏదైనా కేసు నమోదైతే మొత్తం ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయే వీలుంటుంది. అలాకాకుండా వివిద కేటగిరి పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్‌ ఇస్తే.. కోర్టు కేసు పడితే 1, 2 ఆగిపోయినా.. మిగిలిన వాటి ప్రక్రియ కొనసాగుతుంది. కాగా బుధవారం ప్రకటించిన ఉద్యోగాల్లో 27 శాఖలకు చెందిన ఉద్యోగాలున్నాయి. వీటిని జిల్లా, జోనల్‌, బహుళ జోనల్‌ పోస్టులుగా విభజించారు.

అంతేకాకుండా ఈ నోటిఫికేషన్లను జిల్లాల వారీగా విడుదల చేసేందుకు కసరత్తులు చేయనుంది. టీచర్‌ పోస్టులను విద్యాశాఖ డీఎస్సీ లేదా టీఆర్టీ ద్వారా, పోలీస్‌ ఉద్యోగాలను హోంశాఖ ద్వారా, అలాగే వైద్య ఆరోగ్య శాఖ, నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్‌ సర్వీసుల పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇక ప్రధాన నియామక మండలి అయిన టీఎస్‌పీఎస్సీకి ఏయే బాధ్యతలు అప్పగించాలనే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మొదటి నుంచి గ్రూప్‌ 1, 2, 3, 4 నియామకాలు టీఎస్‌పీఎస్సీ ద్వారానే జరుగుతున్నాయి. ఈ సారి కూడా ఇవ్వాలా? లేదా కొన్నింటిని మాత్రమే ఇచ్చి, మిగిలినవి జిల్లా కమిటీల ద్వారా నియామకాలు చేపట్టాలా అనే విషయంపై ప్రభుత్వం చర్చలు సాగిస్తోంది.

Also Read:

TS Govt Job Notifications 2022: ఈ సారి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు.. టీఎస్పీఎస్సీ ద్వారా ఏయే పోస్టులంటే..