AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Angiogram: అసలు యాంజియోగ్రామ్ అంటే ఏమిటి.. ఏ సమయాల్లో చేస్తారు..? ఎందుకు చేస్తారు..?

గుండెకు సంబంధించి ప్రధానంగా 3 రక్తనాళాలు ఉంటాయి. ఇందులో 70 శాతం లోపు బ్లాక్స్ ఉంటే మెడిసిన్‌తో క్యూర్ చేయవచ్చు. 70 శాతం కన్నా ఎక్కువగా ఉంటే స్టంట్ వేస్తారు.

Angiogram: అసలు యాంజియోగ్రామ్ అంటే ఏమిటి.. ఏ సమయాల్లో చేస్తారు..? ఎందుకు చేస్తారు..?
Angiogram
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2022 | 1:03 PM

Share

సాధారణంగా యాంజియోగ్రామ్‌ రక్తనాళాల పనితీరుని తెలుసుకునేందుకు చేస్తారు. ఏ అవయవానికి సంబంధించిన రక్తనాళాలనైనా పరీక్షించవచ్చు. గుండె రక్తనాళాలను పరీక్షిస్తే దానిని కరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. అదే మెదడుకు చేస్తే సెరిబ్రల్ యాంజియోగ్రామ్ అంటారు. గుండె పనితీరుపై ఏమైనా అనుమానాలు ఉంటే మొదట CT యాంజియోగ్రామ్ నిర్వహిస్తారు. ఈ రిపోర్టులో ఏమైనా లక్షణాలు కనిపిస్తే మరింత మెరుగైన ఫలితాల కోసం కరోనరీ యాంజియోగ్రామ్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో చేతి ద్వారా చిన్న పరికరాన్ని గుండె రక్తనాళాల వరకు పంపుతారు. అందులో ఏమైనా బ్లాక్స్‌ ఉన్నాయా లేదా అనేది గుర్తిస్తారు. ఎలాంటి సమస్య లేకపోతే వెంటనే డిశ్చార్జ్ చేస్తారు. ఒక వేళ బ్లాక్స్ గుర్తిస్తే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి….

గుండెకు సంబంధించి ప్రధానంగా 3 రక్తనాళాలు ఉంటాయి. ఇందులో 70 శాతం లోపు బ్లాక్స్ ఉంటే మెడిసిన్‌తో క్యూర్ చేయవచ్చు. 70 శాతం కన్నా ఎక్కువగా ఉంటే స్టంట్ వేస్తారు.. 3 రక్తనాళాల్లోనూ బ్లాక్‌లు ఎక్కువగా ఉంటే అప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు. జనరల్‌గా…గుండె పనితీరుని తెలుసుకునేందుకు ECG, ఈకో పరీక్షలు చేస్తారు.. ఇవి ప్రాథమిక టెస్టులు. ఇందులో డౌట్ ఉంటే CT యాంజియోగ్రామ్.. అందులోనూ ఇబ్బందులు గుర్తిస్తే కరోనరీ యాంజియో గ్రామ్ చేస్తారు…

ఈ మధ్య కోవిడ్ వచ్చిన కోలుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడం అనే సమస్యను ప్రధానంగా గుర్తిస్తున్నారు. గుండె కండరాలు కూడా వీక్ అవుతున్నట్లు తేలింది. కరోనా సోకిన టైమ్‌లో సరైన ఆహారం తీసుకోకపోయినా.. ఎక్సైర్‌సైజ్ చేయకపోయినా… ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనైనా…గుండె సంబంధిత సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ రిస్క్‌ ఫ్యాక్టర్స్‌లో ఇది ఒకటి. అంతే తప్ప కోవిడ్ వల్లే గుండె జబ్బులు వస్తాయని అనుకోవడం పొరపాటని చెబుతున్నారు వైద్యులు. మిగతా రిస్క్‌ ఫ్యాక్టర్లకు కోవిడ్ కూడా తోడవుతుందని అంటున్నారు.

Also Read: CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు

Follow Us
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన మెటల్ రేట్లు...
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
హాట్ సమ్మర్‌లో కేరళలోని ఈ బ్యూటిఫుల్ కూల్ ప్రదేశాలను తప్పక చూడండి
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
ఇది మైలేజీలో రారాజు.. 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్‌!
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు