AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eating Fast: వేగంగా తినడం వల్ల చాలా నష్టాలు.. తెలిస్తే ఎప్పుడు అలా ట్రై చేయరు..!

Eating Fast: చాలామంది ఆహారాన్ని రకరకాలుగా తింటారు. కొంతమంది నిదానంగా తింటే మరికొంతమంది ఫాస్ట్‌గా తింటారు. అయితే నిదానంగా తింటే పర్వాలేదు కానీ వేగంగా

Eating Fast: వేగంగా తినడం వల్ల చాలా నష్టాలు.. తెలిస్తే ఎప్పుడు అలా ట్రై చేయరు..!
Eating Fast
uppula Raju
|

Updated on: Mar 11, 2022 | 1:24 PM

Share

Eating Fast: చాలామంది ఆహారాన్ని రకరకాలుగా తింటారు. కొంతమంది నిదానంగా తింటే మరికొంతమంది ఫాస్ట్‌గా తింటారు. అయితే నిదానంగా తింటే పర్వాలేదు కానీ వేగంగా తింటే మాత్రం చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి నగరాలలో, పట్టణాలలో జనాలు బిజీ షెడ్యూల్‌ వల్ల ఆగమాగం తింటారు. తర్వాత చాలా బాధలని ఎదుర్కొంటారు. వేగంగా తినడం వల్ల ఎక్కువగా తినే సమస్య ఎదురువుతుంది. అంతేకాదు మన శరీరానికి పోషకాలు కూడా అందవు. ఎందుకంటే త్వరగా ఆహారాన్ని తిన్నప్పుడు ఎంత పరిమాణంలో తింటున్నాము అనే ఆలోచన ఉండదు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. దీంతో అనేక వ్యాధులు చుట్టుముడతాయి. మీరు హడావిడిగా ఆహారం తిన్నప్పుడు కడుపు నిండిన భావన ఉండదు. ఆకలి, దాహానికి సంబంధించి మెదడు ఎటువంటి సందేశాలని పంపించదు.

వేగంగా ఆహారం తినడం వల్ల ఎటువంటి ఆహారం తింటున్నారో మరిచిపోతారు. తరువాత వేగంగా బరువు పెరుగుతారు. ఆహారం తినే సమయంలో నమలడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. అప్పుడు ఊబకాయం సమస్య మనల్ని చుట్టుముట్టదు. వేగంగా తినడం అనేది జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే హడావుడిగా పెద్ద పెద్ద ముద్దలుగా నమలకుండా మింగేస్తారు. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాక అనేక సమస్యలు మొదలవుతాయి. జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. రక్తంలో చక్కెర పరిమాణం అకస్మాత్తుగా పెరుగుతుంది. ఆపై ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య పెరగడం మొదలవుతుంది. దీని కారణంగా మీరు షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఆ నెంబర్ల గురించి సమాచారం తెలుసుకోండి..!

Bajaj Pulsar: ఇప్పుడు బజాజ్ పల్సర్‌ సరికొత్త స్టైల్‌లో.. ధరలో ఎటువంటి మార్పు లేదు..!

Viral Video: బురదలో చిక్కుకున్న జేసీబీకి మరొక జేసీబీ హెల్ప్‌.. వైరల్‌ అవుతున్న వీడియో..