AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఆ నెంబర్ల గురించి సమాచారం తెలుసుకోండి..!

EPFO: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు అనేక సౌకర్యాలను పొందుతారు. నిరంతరం EPFO ​తన సభ్యులకు ట్వీట్ల ద్వారా సమాచారం తెలియజేస్తూనే

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఆ నెంబర్ల గురించి సమాచారం తెలుసుకోండి..!
Epfo
uppula Raju
|

Updated on: Mar 11, 2022 | 1:21 PM

Share

EPFO: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు అనేక సౌకర్యాలను పొందుతారు. నిరంతరం EPFO ​తన సభ్యులకు ట్వీట్ల ద్వారా సమాచారం తెలియజేస్తూనే ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులు అవసరమైన సమయంలో ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బును విత్‌ డ్రా చేసుకోవచ్చు. కరోనా కాలంలో ఈపీఎఫ్‌వో ఉద్యోగులకి గొప్ప సాయం చేసింది. వాస్తవానికి EPFO ఖాతాదారులు పెన్షన్ పొందడానికి పెన్షన్ చెల్లింపు ఆర్డర్ నంబర్, PPO నంబర్ అవసరమవుతుంది. ఎందుకంటే వీటి ద్వారా ఈపీఎఫ్‌వో సంస్థ నుంచి అనేక లాభాలు పొందవచ్చు. ఒకవేళ PPO నంబర్ సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్‌తో కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ నెంబర్లు పోయినట్లయితే చింతించవలసిన అవసరం లేదు. మీరు దానిని మళ్లీ PF నంబర్ ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఖాతా నంబర్ నుంచి కూడా తిరిగి తెలుసుకోవచ్చు.

పోగొట్టుకున్న PPO నంబర్ తెలుసుకోవడం ఎలా..?

1. ముందుగా మీరు EPFO అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. దాని ఎడమ వైపున ఇచ్చిన ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్‌కు వెళ్లి పెన్షనర్స్ పోర్టల్ ఎంపికపై క్లిక్ చేయాలి.

3. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఒక న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. దానిపై మీరు ఎడమ వైపున మీ PPO నంబర్‌ని తెలుసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.

4. మీ పెన్షన్ ఫండ్‌కి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయడం ద్వారా మీరు మీ PPO నంబర్‌ను శోధించవచ్చు.

5. ఇది కాకుండా పింఛనుదారులు సభ్యుల ID లేదా PF నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి PPO నంబర్‌ను శోధించవచ్చు.

6. వివరాలను నమోదు చేసిన తర్వాత సమర్పించండి. అప్పుడు మీ PPO నంబర్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Post Office Net Banking: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా.. ఇలా నెట్‌ బ్యాంకింగ్‌ యాక్టివేట్‌ చేసుకోండి..!

Bajaj Pulsar: ఇప్పుడు బజాజ్ పల్సర్‌ సరికొత్త స్టైల్‌లో.. ధరలో ఎటువంటి మార్పు లేదు..!

Viral Video: బురదలో చిక్కుకున్న జేసీబీకి మరొక జేసీబీ హెల్ప్‌.. వైరల్‌ అవుతున్న వీడియో..