Longest Living Creatures: తెలుసా! ఈ జంతువులు లక్షల ఏళ్లగా భూమిపై ఇంకా బతికే ఉన్నాయట..
తాబేళ్ల ఇంతకంటే ఎక్కువ కాలం భూమిపై జీవిస్తున్న జీవులు కూడా ఉన్నాయట. నమ్మశక్యంగాలేకపోయినా ఇది వాస్తవమండీ! వందలు, వేలు కాదు ఏకంగా మిలియన్ల సంవత్సరాలుగా భూమిపై సజీవంగా ఉన్నాయట. ఆ వివరాలు మీకోసం..
Longest Living Creatures On The Planet: భూమిపై కొన్ని వేల ఏళ్లగా వివిధ రకాల జంతువులు నివసిస్తున్నాయి. కాలక్రమంలో కొన్ని జంతువలు కనుమరుగైపోయాయి. మిగలినవి ప్రస్తుతం మనకు కనిపించేవి. ఐతే వీటిలో ఎక్కువ కాలం జీవించే జంతువేదంటే (longest living creatures on earth).. వెంటనే తాబేళ్లు (turtles)అని సమాధానం చెబుతారు.150 ఏళ్లని కొందరు, 200 ఏళ్లని మరికొందరు, 250 సంవత్సరాలపాటు కూడా జీవిస్తాయనే భిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. ఐతే ఇంతకంటే ఎక్కువ కాలం భూమిపై జీవిస్తున్న జీవులు కూడా ఉన్నాయట. నమ్మశక్యంగాలేకపోయినా ఇది వాస్తవమండీ! వందలు, వేలు కాదు ఏకంగా మిలియన్ల సంవత్సరాలుగా భూమిపై సజీవంగా ఉన్నాయట. ఆ వివరాలు మీకోసం..
మింగ్ అనే నత్త 507 ఏళ్లు జీవించింది. దీనిపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్న సమయంలో, వాళ్లు చేసిన చిన్న మిస్టేక్ కారణంగా చనిపోయిందట.
1979లో రష్యా శాస్త్రవేత్త సబిత్ అబిజోవ్ అంటార్కిటికాలో సుమారు 3600 మీటర్ల లోతులో ఉన్న కొన్ని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, చిన్న జీవులను కనుగొన్నాడు. ఈ జీవులు వేల సంవత్సరాల నుంచి సజీవంగా ఉన్నాయని ఆతను చెబుతున్నాడు.
మీడియా రిపోర్టుల ప్రకారం.. 2007 సంవత్సరంలో డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం 5 మిలియన్ సంవత్సరాల నుంచి బతికే ఉన్న బ్యాక్టీరియాను కనుగొన్నారు. అంటార్కిటికా, సైబీరియా, కెనడాలోని అతి శీతల ప్రాంతాల్లో వీటిని కనుగొన్నారు.
2009 సంవత్సరంలో సైబీరియాలోని రష్యన్ శాస్త్రవేత్త అనటోలీ బ్రోష్కోవ్ 3.5 మిలియన్ సంవత్సరాల నాటి సజీవ బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇంజక్షన్ ద్వారా ఈ బ్యాక్టీరియాను తన శరీరంలోకి ఎక్కించుకున్నానని, ఆ తర్వాత రెండేళ్ల వరకు తనకు జలుబు, జ్వరం రాలేదని కూడా తన నివేదికలో పేర్కొన్నాడు.
Also Read: