Radhe Shyam: ఆర్టీసీ బస్సే క్షేమం అంటోన్న రాధేశ్యామ్‌.. సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న సజ్జనార్‌ పోస్ట్‌..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం రాధేశ్యామ్. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (మార్చి11) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది

Radhe Shyam: ఆర్టీసీ బస్సే క్షేమం అంటోన్న రాధేశ్యామ్‌.. సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న సజ్జనార్‌ పోస్ట్‌..
Radheshyam
Follow us

|

Updated on: Mar 11, 2022 | 11:18 AM

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం రాధేశ్యామ్. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (మార్చి11) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే హిట్‌ టాక్‌ రావడంతో ప్రభాస్‌ అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దైంది. డప్పులు కొడుతూ, బాణసంచా కాలుస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ థియేటర్ల వద్ద నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే రాధేశ్యామ్ సినిమా గురించి తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ (VC Sajjanar) చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆర్టీసీ అభివృద్ధి కోసం తనదైన శైలిలో పాటు పడుతోన్న ఆయన ఇందుకోసం సోషల్ మీడియాను ఆయుధంగా ఎంచుకున్నారు. ప్రజారవాణాను ప్రజలకు చేరువయ్యేలా సినిమా డైలాగులు, సీన్లతో మీమ్స్‌, పోస్టులు పెడుతున్నారు. ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సుల ప్రమోషన్‌ కోసం రాధేశ్యామ్ సినిమాను కూడా వాడుకున్నారు.

ఆర్టీసీ బస్సులోనే వెకేషన్‌కు వెళదామా? ఇందులో భాగంగా సినిమాలో ప్రభాస్‌, పూజాహెగ్డేల మధ్య జరిగే సంభాషణను తనదైన శైలిలో రీక్రియేట్‌ చేశారు. ఇందులో ‘చాలా రోజుల తర్వాత కలిశాం, ఏదైనా వెకేషన్‌కు వెళదామా?’ అని ప్రభాస్‌ అనగా ‘వెళదాం కానీ, ఆర్టీసీ బస్సులోనే వెళదాం’ అని పూజా అంటుంది. ‘ఎందుకు?’ అని రెబల్‌స్టార్‌ తిరిగి ప్రశ్నించగా ‘ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం’ అని పూజా సమాధానం ఇస్తుంది. ఈ పోస్టుకు ‘బస్సే క్షేమం అంటున్న రాధేశ్యామ్‌’ అని ఒక టైటిల్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read:AP Budget 2022: ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు.. ఏయే శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే?

CM KCR Yadadri Visit: సీఎం కేసీఆర్ నేటి యాదాద్రి పర్యటన వాయిదా.. మళ్లీ ఎప్పుడు వెళ్లనున్నారంటే..!

Yagya Benefits: యాగం చేయడం వెనుక ఆధ్యాత్మిక కారణమే కాదు.. శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. ఏవి ఏమిటంటే