CM KCR Yadadri Visit: సీఎం కేసీఆర్ నేటి యాదాద్రి పర్యటన వాయిదా.. మళ్లీ ఎప్పుడు వెళ్లనున్నారంటే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ్టి యాదాద్రి పర్యటన వాయిదా పడింది. బిజీ షెడ్యూల్ కారణంగా పర్యటనలో మార్పు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

CM KCR Yadadri Visit: సీఎం కేసీఆర్ నేటి యాదాద్రి పర్యటన వాయిదా.. మళ్లీ ఎప్పుడు వెళ్లనున్నారంటే..!
Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 11, 2022 | 10:18 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ్టి యాదాద్రి పర్యటన వాయిదా పడింది. బిజీ షెడ్యూల్ కారణంగా పర్యటనలో మార్పు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఇవాళ యాదాద్రిలో పర్యటిస్తారని సీఎంవో ముందుగా ప్రకటించింది. కానీ, ఈ పర్యటన షెడ్యూల్‌ను తాజాగా రద్దు చేశారు. అయితే, ఈ ఏడాది యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవ‌కాశం ఉందని సమాచారం. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ పునః నిర్మాణ పనులను వేగంగా పూర్తవుతున్నాయి.

ఇవాళ యాదాద్రిలో పర్యటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆలయ ప్రారంభానికి సమయం సమీపిస్తున్న వేళ క్షేత్ర పర్యటనకు వెళ్తాలని భావించారు. 11 గంటలకు యాదాద్రీశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే లక్ష్మీనారసింహుల కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి KCR పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. ఒకవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ముఖ్యమంత్రి బీజీ షెడ్యూల్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది.

ఈనెల 28వ తేదీన ప్రధానాలయం పునఃప్రారంభ నేపథ్యంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మహా కుంభ సంప్రోక్షణ, అంకురార్పణపై అధికారులతో CM సమీక్ష నిర్వహించాలని భావించారు. అనంతరం యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై CM KCR సమీక్షించాలనుకున్నారు. CM రాక నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల క్రితం ప్రగతిభవన్‌లో యాడా, ఆలయ నిర్వాహకులతో CM KCR సమావేశమయ్యారు. ఆలయ పునర్నిర్మాణ పనులు, పునఃప్రారంభ ఏర్పాట్లు, ఆలయ ఉద్ఘాటన పర్వంలో చేపట్టనున్న పంచకుండాత్మక హోమం, మహాకుంభ సంప్రోక్షణ పర్వాలపై చర్చించారు. యాదాద్రిలో ఈనెల 21 నుంచి మహాసుదర్శన యాగం నిర్వహించనుండగా.. 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మహాసుదర్శన యాగ స్థలం, అన్నదానం కాంప్లెక్స్‌, సత్యనారాయణ వ్రతాలు, దీక్షాపరుల మండపాలు, బస్టాండ్‌ పనులు సిద్ధం చేస్తున్నారు. పుష్కరిణి వద్ద స్నానపు గదుల నిర్మాణాల చివరి దశకు చేరుకున్నాయి.

Read Also… Viral Video: ఆ నలుగురిలో అమ్మ ఎవరు..? బుడ్డోడు గుర్తించాడా..? క్యూట్ వీడియో