TS RJC & RDC CET 2022: తెలంగాణ బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆర్‌జేసీ సెట్, ఆర్‌డీసీ సెట్ 2022-23 నోటిషికేషన్లు విడుదల!
తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుక బడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIT).. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో (Inter, Degree admissions)ప్రవేశాలకు అర్హులైన..
TSMJBC RJC and RDC CET 2022: తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుక బడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIT).. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో (Inter, Degree admissions)ప్రవేశాలకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. తాజా నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, డిగ్రీ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి ముఖ్యమైన తేదీలు, అర్హతలు, ఇతర వివరాలు మీకోసం..
వివరాలు:
- మొత్తం జూనియర్ (ఇంగ్లీష్ మీడియం) కాలేజీలు: 138
ఇంటర్ గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ ఇతర వృత్తి విద్యాకోర్సులు అందిస్తాయి.
- మహిళా డిగ్రీ (ఇంగ్లీష్ మీడియం) కాలేజీలు:
డిగ్రీ కోర్సులు: బీఎస్సీ-ఎంపీసీ, బీఎస్సీ-ఎంఎస్‌సీఎస్, బీఎస్సీ-ఎంపీసీఎస్, బీఎస్సీ-బీజెడ్‌సీ, బీఎస్సీ-బీబీసీ తదితర కోర్సులు అందిస్తాయి.
అర్హతలు: ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్ధులు పది/ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 25, 2022.
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ తేదీ: మే 28, 2022.
ప్రవేశ పరీక్ష తేదీ: జూన్ 5, 2022.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: